గల్ప్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటం..థార్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో యూఏఈ అప్రమత్తమయింది. భారత్తో సహా 14 దేశాలకు చెందిన ప్రయాణికులపై నిషేదం విధించింది. ఈ నిషేధం జులై 21 వరకు అమలులో ఉండబోతున్నది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాలపై కూడా యూఏఈ నిషేదం విధించింది. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుఏఈ సివిల్ ఏవియోషన్ అధారిటి తెలియజేసింది. అయితే, కార్గో, చార్టెడ్ విమానాలకు ఈ నిషేదం వర్తించదని తెలియజేసింది. యూఏఈ ఎక్కువగా పర్యటకులు వస్తుంటారు కాబట్టి..కరోనా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కేది వీరికే..!