Saturday, November 23, 2024

భార‌త విమానాల‌పై నిషేధం పొడిగించిన యూఏఈ

భారత్‌లో కరోనా కేసుల విజృంభణ నేపధ్యంలో విమానయానంపై ఏప్రిల్‌ 24 న విధించిన నిషేధాన్ని యూఏఈ ఇప్పటివరకు రెండు సార్లు పొడిగించింన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మారు నిషేధాన్ని పొడగించింది దుబాయ్ ప్రభుత్వం. దుబాయి నుంచి భారత్‌కు విమానాలు వెళ్లడానికి ఇప్పటికి అనుమతి ఉన్నప్పటికీ, భారత్‌ నుంచి మాత్రం విమానాల రాకపై నిషేధముంది. భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జూలై వరకు పొడిగించాలని యూఏఈ ప్రభుత్వం  నిర్ణయించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్ధ ఈ వివరాలను వెల్లడించింది.

కేవలం దౌత్యవేత్తలు, యూఏఈ పౌరులు, ఎంపిక చేసిన గోల్డెన్‌ వీసా హోల్డర్లను మాత్రమే తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు. ఇదిలా ఉంటే… కరోనా ఉధృతి తగ్గనిపక్షంలో… జులై తర్వాత కూడా మరోమారు నిషేధాన్ని పొడిగించే అవకాశాలు లేకపోలేదని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement