Tuesday, November 26, 2024

రిజిస్ట్రార్‌ కంపెనీలకు యు గ్రో క్యాపిటల్‌ ఎన్‌సీడీ.. సమర్పించిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద నమోదైన, డిపాజిట్లు స్వీకరించని, వ్యవస్థాగతంగా అత్యంత కీలకమైన ఎన్‌బీఎఫ్‌సీ యు గ్రో క్యాపిటల్‌ లిమిటెడ్‌.. మార్చి 30న రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వద్ద రేటెడ్‌, సెక్యూర్డ్‌, సీనియర్‌, లిస్టెడ్‌, ట్రాన్స్‌ఫరబుల్‌, రిడీమబల్‌, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ)ను జారీ చేసేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా వీటి అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్టు కంపెనీ వివరించింది. రూ.1000 ఫేస్‌ వ్యాల్యూ కలిగిన ఎన్‌సీడీలను రూ.5వేల లక్షల వరకు జారీ చేయనున్నారు. రూ.5వేల లక్షల వరకు ఓవర్‌ సబ్‌ స్క్రిప్షన్‌ అయ్యేందుకు అవకాశం ఉంది. తద్వారా మొత్తం ఇష్యూ సైజ్‌ రూ.10,000 లక్షల వరకు ఉంటుంది. ఈ ఈక్విటీ షేర్లను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్‌ చేయనున్నారు. ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తాలతో కనీసం 75 శాతం కంపెనీ ప్రస్తుత రుణ చెల్లింపులు, రుణ వితరణ తదితర కార్యక్రమాలకు వినియోగించనుండగా.. 25 శాతం సాధారణ కార్పొరేట్‌ కారణాల కోసం వినియోగించేందుకు కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత ఎన్‌సీడీలకు అక్యూట్‌ ఏ ప్లస్‌ రేటింగ్‌ను 200 కోట్ల రూపాయలకు అక్యూట్‌ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ అందించింది. ఈ ఇష్యూ తెరిచే తేదీని కూడా ప్రకటించింది. 2022, ఏప్రిల్‌ 7వ తేదీన ఈ ఇష్యూ తెరుస్తుందని, 2022 మే 6వ తేదీన మూసివేయడం జరుగుతుందని తెలిపింది. ఈ ఎన్‌సీడీలపై కూపన్‌/వడ్డీ రేటు సిరీస్‌ 1లో 10 శాతం కాగా.. సిరీస్‌ 2లో 10.15 శాతం, సిరీస్‌ 3లో 10.45 శాతంగా ఉండనుంది.

ఇవే ఇష్యూ మేనేజర్లు..

ఈ ఇష్యూకు లీడ్‌ మేనేజర్లుగా సండే క్యాపిటల్‌ అడైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, టిప్సన్స్‌ కన్సల్టెన్సీ సరీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ట్రస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహరిస్తున్నాయి. మిట్‌కాన్‌ క్రెడెన్షియా ట్రస్టీషిప్‌ సరీసెస్‌ లిమిటెడ్‌ (గతంలో మిట్‌కాన్‌ ట్రస్టీషిప్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అనే పిలుస్తారు) ఇష్యూకు డిబెంచర్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నది. ఈ సందర్భంగా యు గ్రో క్యాపిటల్‌ లిమిటెడ్‌ ఈసీ అండ్‌ ఎండీ సచింద్రనాథ్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అమిత్‌ గుప్తాతో పాటు చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ నీరవ్‌ షా మాట్లాడుతూ.. తమ కంపెనీ.. ఆర్‌బీఐతో రిజిస్టర్‌ చేయబడిన సిస్టమిక్‌గా కీలకమైన ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ అని, ఈక్విటీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్టింగ్‌ చేయబడ్డాయని వివరించారు. భారతీయ ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు కీలకమైన, ఇంకా సరసమైన, సమర్థవంతమైన, స్థిరమైన క్రెడిట్‌ లభ్యత లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈ రంగానికి ఫైనాన్స్‌ సాయం చేసే కంపెనీగా చెప్పుకొచ్చారు. ఎంఎస్‌ఎంఈలు అత్యంత కీలకమైన సేంద్రీయ పద్ధతిని సూచిస్తాయన్నారు. దీని ద్వారా దేశంలో పేదల సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుందని వివరించారు. తమ కంపెనీ క్విక్‌ లోన్‌ అప్రూవల్‌ అవార్డు, బెస్ట్‌ లెండింగ్‌ టెక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ద్వారా నేషనల్‌ అవార్డు ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మార్కెటింగ్‌ పొందినట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement