Tuesday, November 26, 2024

Mahindra నుంచి రెండు ఎలక్ట్రిక్‌ కార్లు

మహీంద్రా అండ్‌ మహీంద్రా మంగళవారం నాడు రెండు కొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కార్లను మార్కెట్‌లో విడుదల చేసింది. బీఈ6ఈ, ఎక్స్‌ఈవీ 9ఈ పేర్లతో కంపెనీ వీటిని తీసుకు వచ్చింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఇగ్లో ప్లాట్‌ఫామ్‌పై వీటిని రూపొందించారు. కంపెనీ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వ్యూహంలో ఇదో కీలకమైనదని పేర్కొంది. ఈ కార్ల డెలివరీలు ఈ ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.

ఈ రెండు కార్లు వినూత్న డిజైన్లతో కంపెనీ తీసుకు వచ్చింది. వీటిలో చాలా ఆధునిక ఫీచర్లు ఇచ్చారు. బీఈ6ఈ ఎక్స్‌ఈవీ 9ఈ కార్లు 59 కిలోవాట్‌ అవర్‌, 79 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తాయి. ఈ రెండు కార్లు సింగిల్‌ ఛార్జ్‌తో 450-500 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తాయని కంపెనీ తెలిపింది. 20-80 శాతం ఛార్జింగ్‌ 20 నిముషాల్లో అవుతుందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement