Wednesday, November 20, 2024

TVS | ఫ్రాన్స్‌ మార్కెట్‌లోకి టీవీఎస్‌ మోటార్స్‌

భారత్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టీవీఎస్‌ మోటార్స్‌ ఫ్రాన్స్‌ మార్కెట్లోకి లోకి ప్రవేశించింది. ఆ దేశానికి చెందిన జ్యూరిచ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎమిల్‌ ఫ్రే సంస్థతో టీవీఎస్‌ మోటార్స్‌ ఒప్పందం చేసుకుంది. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ యూరోప్‌లోనే అతి పెద్ద ఆటో మొబైల్‌ దిగుమతిదారు, పంపిణిదారుగా ఉంది. ఈ సంస్థ టీవీఎస్‌కు చెందిన పలు టూ వీలర్స్‌ను యూరోప్‌ మార్కెట్లో విక్రయించనుంది.

యూరోపియన్‌ మార్కెట్‌లో టీవీఎస్‌ మోటార్స్‌ ఉత్పత్తులు ప్రవేశిస్తాయని ఈ ఒప్పందంపై మాట్లాడుతూ టీవీఎస్‌ మోటార్స్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌ మిశ్రా చెప్పారు. ఫ్రాన్స్‌ మార్కెట్‌లో అపాచీ ఆర్‌ఆర్‌ 310, అపాచీ ఆర్‌టీఆర్‌ 310, రోనిన్‌, విద్యుత్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌ ఎస్‌, టీవీఎస్‌ ఎక్స్‌తో పాటు మరో స్కూటర్‌ ఎన్‌టార్క్‌ కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ మోడల్‌ బైక్‌లు, స్కూటర్లకు యూరోప్‌ ఆమోదం అభించింది. ఫ్రాన్స్‌లో జరిగిన లాంచింగ్‌ కార్యక్రమంలో కంపెనీ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. టీవీఎస్‌ మోటార్స్‌ 80 దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు చాలా కాలంగా టీవీఎస్‌ మోటార్‌ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. తాజాగా కంపెనీ యూరోప్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement