నిత్యావసర సరుకులపై జీఎస్టీ విధించడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని వ్యాపారులు, షాపుల యజమానులు నిర్ణయించారు. ఆహార ధాన్యాలు, ఆహార పదార్ధాలపైనా, అనేక రకాల గృహోపకరణాలపైనా జీఎస్టీ విధించారు. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు పన్నులు లేని అనేక ఆహార పదార్ధలపై 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల ధరలు పెరుగుతాయని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఇది సామాన్యుల తో పాటు, వ్యాపారులపై కూడా భారం పడుతుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పర్వీన్ ఖండేల్వాల్ చెప్పారు. ఈ అసోసియేషన్‌లో దేశ వ్యాప్తంగా కోటి మంది చిన్న షాపుల యాజమానులు, హోల్ సేలర్స్ సభ్యులుగా ఉన్నారు. అసోసియేషన్ సమావేశాలు జులై 26న భూపాల్‌లో జరుగుతాయని, ఈ సమావేశాల్లో జీఎస్టీపై చర్చిస్తామని చెప్పారు.
దీని తరువాత దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. వంటిం టికి చెందిన పలు రకాల వస్తువులపై 12 నుంచి 18 శాతానికి జీఎస్టీ పెంచారని దీని వల్ల సామన్యులపై భారం పడుతుందన్నారు. 25 కేజీలు, లేదా లీటర్ల ప్యాక్ చేసిన ఆన్ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా జీఎస్టీ విధించారని ఆయన తెలిపారు. దీని వల్ల ఇప్పటికే పెరిగిన వీటి ధరలు మరింత పెరుగుతాయని చెప్పారు. వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం మే నెలలో అత్యధికంగా 7.79 శాతానికి పెరిగిందని, జూన్‌లో అది 7 శాతంగా నమోదైంది. ఇప్పుడు ఇది మరింత పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసవారు. ప్రధాన మంత్రి జోక్యం చేసుకుని దీన్ని సవరించాలని వ్యాపారులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.