Tuesday, November 19, 2024

HYD: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టొయోటా కిర్లోస్కర్ మోటర్ భాగస్వామ్యం

హైదరాబాద్: వినూత్న పరిష్కారాల ద్వారా వినియోగదారుల అనుభవాలను మెరుగు పరచడంతో పాటుగా కారు యాజమాన్య అనుభవాలను క్రమబద్ధీకరించాలనే తమ నిరంతర ప్రయత్నంలో భాగంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం) వినియోగదారులకు సమగ్రమైన వాహన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించటం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుంది. కస్టమర్‌ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడం, టొయోటా వాహనాలను గతంలో కంటే మరింత మెరుగ్గా అందుబాటులోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన పరిష్కారాలను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.

ఈసంద‌ర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ సంస్థ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా వాహన ఫైనాన్సింగ్ అవకాశాలను పెంపొందించడం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యంతో తాము సంతోషిస్తున్నామన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా, టయోటా వాహనాన్ని గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ మంది కస్టమర్‌లకు చేరువ చేయడం తమ లక్ష్యమ‌న్నారు.

- Advertisement -

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ… అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా, టయోటా కిర్లోస్కర్ మోటర్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. త‌మ డిజిటలైజ్డ్ లోన్ విధానాలు అత్యంత సులభంగా కొత్త టొయోటా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లను అనుమతిస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement