Friday, October 18, 2024

HYD: ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ ను పరిచయం చేసిన టొయోటా కిర్లోస్కర్ మోటార్

హైదరాబాద్ : టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ ని పరిచయం చేసింది. ఇందులో ప్రత్యేకమైన టొయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (టిజిఏ) ప్యాకేజ్‌లు ఉన్నాయి. 2022లో విడుదల అయినప్పటి నుండి, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ దాని అత్యాధునిక సాంకేతికత, డైనమిక్ పనితీరు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో దేశవ్యాప్తంగా వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఈసంద‌ర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటార్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ… 2022లో విడుదల చేసినప్పటి నుండి, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ స్థిరమైన మొబిలిటీని అందించడంలో టికెఎం నిబద్ధతకు చిహ్నంగా ఉందన్నారు. అధిక కస్టమర్ సంతృప్తితో అపూర్వమైన ప్రజాదరణను పొందిందన్నారు. పెరుగుతున్న డిమాండ్, సానుకూల ఆదరణ త‌మ ఆఫర్‌లను నిరంతరం మెరుగు పరచడానికి మమ్మల్ని ప్రోత్సహించాయన్నారు. ప్రత్యేకమైన టిజిఎ ప్యాకేజీని కలిగి ఉన్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ పరిచయంతో తాము త‌మ కస్టమర్‌లకు మరింత వ్యక్తిగతీకరించిన, ప్రీమియం డ్రైవింగ్ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement