హైదరాబాద్, (ఆంధ్రప్రభ): టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం) అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారతదేశంలో 1,00,000-యూనిట్ అమ్మకాల మైలురాయిని అధిగమించిందని ప్రకటించింది. ఈ విజయం బిఎస్యువి బలమైన మార్కెట్ అంగీకారాన్ని, హైబ్రిడ్ టెక్నాలజీకి పెరుగుతున్న భారతీయ కస్టమర్ల ఆదరణను నొక్కి చెబుతుంది.
ఈ మైలురాయిపై టొయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ… అర్బన్ క్రూయిజర్ హైరైడర్కు వచ్చిన సానుకూల స్పందన భారతీయ వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వినూత్న మొబిలిటీ సొల్యూషన్లను అందించడంలో తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.
ఈ మైలురాయి కేవలం సంఖ్య కాదు, ఇది స్థిరత్వం, పనితీరు, కస్టమర్ సంతృప్తికి ప్రాధాన్యతనిచ్చే ఎస్యువి టెక్నాలజీలో కొత్త శకానికి నాంది పలికిందన్నారు. ఈ మైలురాయిని సాధించడంలో కీలకపాత్ర పోషించిన తమ కస్టమర్లకు తాము తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.