Friday, November 29, 2024

ప్రత్యేక లిమిటెడ్-ఎడిషన్‌ను పరిచయం చేసిన టొయోటా కిర్లోస్కర్ మోటర్

హైద‌రాబాద్ : టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) దాని ప్రసిద్ధ మోడళ్లైన గ్లాన్జా, అర్బన్ క్రూయిజర్ టైసర్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లలో ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేయడం ద్వారా కార్ల కొనుగోలుదారులకు ఈ సంవత్సరాంతం గుర్తుండిపోయేలా చేసింది.

ఇటీవల విడుదల చేసిన ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిన తరువాత, స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ టొయోటా జెన్యూన్ యాక్సెసరీ (టిజిఎ) ప్యాకేజీలను అందించడం ద్వారా వినియోగదారుల కేంద్రీకృత పట్ల టొయోటా నిబద్ధతను మరింత ముందుకు తీసుకువెళ్లింది.

స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ కాకుండా, టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైసర్ అండ్ రూమియన్ (సీఎన్జీ మోడల్‌లు మినహా)లో రూ.1లక్ష పైన ప్రత్యేకమైన ఇయర్ ఎండ్ ఆఫర్‌లను అందిస్తోంది. అద్భుతమైన వినియోగదారు ప్రయోజనాలు 31 డిసెంబర్ 2024 వరకు కొనసాగుతాయి.

ఈసంద‌ర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ… తాము గతంలో ప్రకటించిన గ్లాన్జా, అర్బన్ క్రూయిజర్ టైసర్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్‌లకు అద్భుతమైన కస్టమర్ స్పందన పట్ల సంతోషంగా వున్నామన్నారు.

ప్రతి ఒక్కటి ప్రీమియం స్టైలింగ్ అండ్ అధునాతన ఫీచర్‌ల ప్రత్యేకమైన కలయికను అందిస్తోందన్నారు. గ్లాన్జా, అర్బన్ క్రూయిజర్ టైసర్ అండ్ అర్బన్ క్రూయిజర్ హైర్‌డైయర్ కొత్త స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ త‌మ కస్టమర్‌ల మెరుగైన ప్రాధాన్యతలకు అనుగుణంగా, వారి యాజమాన్య అనుభవాన్ని మెరుగు పరిచే ఆఫర్‌లను రూపొందించడంలో త‌మ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement