Friday, November 22, 2024

నష్టాల్లో టైటాన్‌, ఇన్ఫీ షేర్లు.. దిగొచ్చిన చమురు ధరలు..

సెన్సెక్స్‌ 30 షేర్స్‌లో టైటాన్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. హెచ్డిఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్సీ, కొటక్‌ మహీంద్రా బ్యాంకు, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా లాభపడిన జాబితాలో ఉన్నాయి. ముడి చమురు ధరలు గతవారం దాదాపు 13 శాతం మేర పడిపోయాయి. అమెరికా తమ వ్యూహాత్మక నిల్వల నుంచి చమురు విడుదల చేయాలన్న నిర్ణయంలో ఇంటర్నేషన్‌ ఎనర్జీ ఏజెన్సీ కూడా చేరడంతో చమురు ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 103 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. బ్యాంకింగ్‌, లోహ, ఫార్మా, మీడియా, ఎఫ్‌ఎంసీజీ రంగాల సూచీలు రాణించాయి.

మార్కెట్‌కు ఎగుమతుల బూస్ట్‌
2021-22లో భారత్‌ ఎగుమతులు రికార్డు స్థాయిలో నమోదు కావడం కూడా మార్కెట్‌ ర్యాలీకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 41,800 కోట్ల డాలర్లు (సుమారు రూ.3.15 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత భారీ ఎగుమతులు నమోదు అవ్వడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 61,000 కోట్ల డాలర్ల మేర దిగుమతులు నమోదయ్యాయి. దీంతో ఎగుమతులు, దిగుమతుల వ్యాల్యూ మొత్తం లక్ష కోట్ల డాలర్లను మించింది. 2020-21లో ఎగుమతుల విలువ 29,300 కోట్ల డాలర్లు (సుమారు రూ.22లక్షల కోట్లు) మాత్రమే. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ డిపాజిట్లలో 48.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో సంస్థ షేర్లు సోమవారం 5 శాతం మేర లాభపడ్డాయి. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం ముగింపు దిశగా కదులుతుండటం కూడా మార్కెట్లకు కలిసి వచ్చాయి. ఇరు దేశాలు చర్చల దిశలో ముందు సాగాలని కోరుకుంటున్నాయి. దీని కారణంగా చమురు ధరలు దిగి వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement