టిక్‌టాక్ యాప్ యూజర్లకు ఓ గుడ్‌న్యూస్..యాప్‌లో పోస్టు చేసే వీడియో లెన్త్‌ను మూడు నిమిషాలకు పెంచినట్లు టిక్‌టాక్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లలో పాపులర్ యాప్‌గా మారిన టిక్‌టాక్ తన వీడియోల సమయాన్ని మూడు నిమిషాలకు పెంచడం గమనార్హం. వీడియోల లెన్త్‌ను పెంచడం వల్ల కొత్త తరహా కాంటెంట్‌కు ఆస్కారం ఉంటుందని టిక్‌టాక్ చెప్పింది. గతంలో టిక్‌టాక్‌లో కేవలం ఒక నిమిషం వీడియోలు మాత్రమే పోస్టు అయ్యేవి. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ సంస్థ టిక్‌టాక్ వీడియో షేరింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. ఇటీవల ఆ యాప్‌లో ఉన్న 6 కోట్ల వీడియోలను డిలీట్ చేశారు. ఆ వీడియోలు టిక్‌టాక్ రూల్స్ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఇక ఇండియాలో టిక్‌టాక్ వీడియో షేరింగ్ యాప్‌పై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆ యాప్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. దాంట్లో అమెరికాలోనే 10 కోట్ల మంది ఆ యాప్‌ను వాడుతున్నారు.
ఇది కూడా చదవండి: రష్యాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. బూస్టర్ డోస్ మొదలెట్టిన ప్రభుత్వం..