Tuesday, November 26, 2024

అదానీ క్యాపిటల్‌ కొనుగోలుకు మూడు సంస్థల ఆసక్తి

అదానీ గ్రూప్‌ తన పదేళ్ల ఎన్‌బిఎఫ్‌సి అయిన అదానీ క్యాపిటల్‌ను విక్రయించాలని యోచిస్తోంది. దీన్ని కొనుగోలు చేసేందుకు మూడు ప్రైవేట్‌ ఈక్విటీ గ్రూపులు బైండింగ్‌ బిడ్‌లు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యకలాపాలను పటిష్టం చేసుకునే క్రమంలో మూల ధనాన్ని కాపాడుకునేందుకు నాన్‌-కోర్‌ వ్యాపారాల నుండి నిష్క్రమించాలని గౌతమ్‌ అదానీ చూస్తున్నారు. అదానీ క్యాపిటల్‌కు బిడ్లను దాఖలు చేసిన సంస్థలలో బెయిన్‌ క్యాపిటల్‌, కా్లంల్‌ గ్రూప్‌, సెర్బెరస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నాయి. అదానీ క్యాపిటల్‌లో ప్రమోటర్లు దాదాపు 90 శాతం వాటా కలిగి ఉన్నారు. మిగిలిన 10 శాతం మాజీ లెమాన్‌ బ్రదర్స్‌ పేరిట ఉంది. అదానీ క్యాపిటల్‌ నిర్వహణలో రూ.4,000 కోట్ల ఆస్తులు (ఏయూఎం), బుక్‌ వాల్యూలో రూ.800 కోట్లు ఉన్నాయి.

- Advertisement -

రూ. 2,000 కోట్ల వాల్యుయేషన్‌గా ఉండే పుస్తక విలువకు 2-2.5 రెట్లు పెంచాలని కంపెనీ చూస్తోంది. నివేదిక ప్రకారం, కొత్త పెట్టుబడిదారుడు కంపెనీలో రూ.1,000-1,500 కోట్లను వృద్ధి మూలధనంగా పెట్టుబడి పెట్టనున్నారు. అదానీ క్యాపిటల్‌ ఆరు వర్గాలలో రిటైల్‌, హూల్‌సేల్‌ రుణాలను అందిస్తుంది. వీటి అన్నింటిలో వ్యవసాయం అతిపెద్దది. ఇది చిన్న- మధ్య తరహా వ్యాపారాలకు కూడా రుణాలను అందిస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ సహా తొమ్మిది రాష్ట్రాల్లో కంపెనీ విస్తరించివుంది. 2019లో దాని ప్రధాన మౌలిక సదుపాయాల పోర్ట్‌ఫోలియో కోసం క్యాపిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ జర్నీని ప్రారంభించినప్పటి నుండి గత నాలుగు సంవత్సరాలలో, అదానీ గ్రూప్‌ 9 బిలియన్‌ డాలర్లను సేకరించగలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement