ఓరల్ కేర్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్న కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్, కోల్‌గేట్ స్ట్రాంగ్ టీత్ బ్రాండ్ క్రింద ‘#TheDailyGrind’ అనే సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. భారతదేశం అంతటా తరచుగా చిరుతిళ్ళు తినడంలో విపరీతమైన పెరుగుదలపై ఈ ప్రచారం గురి పెట్టింది, దీని ఫలితంగా దంతాలు బలహీనపడతాయి, మొత్తం నోటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఈ విధంగా చూస్తే, 44% మంది భారతీయులు రోజులో అన్ని సమయాలలో ఏదో ఒకటి తింటున్నారని లేదా తాగుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అలవాటు పట్టణ జనాభాలో సాధారణం, భోజనాల మధ్య పెరుగుతున్న చిరుతిండితో పాటు, గ్రామీణ ప్రాంతాలలో కూడా రోజంతా నిరంతరంగా టీ & అల్పాహారం తీసుకునే సందర్భాలు ఉంటున్నాయి.
ప్రతిరోజూ తరచుగా చిరుతిళ్ళు తినడం వల్ల మన దంతాల నుండి కాల్షియం పోవడం తీవ్రతరమవుతుంది అనే వాస్తవాన్ని ఈ ప్రచారం దృశ్యరూపంలో హైలైట్ చేస్తుంది. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ యొక్క విశిష్టమైన అర్జినైన్ + కాల్షియం బూస్ట్ టెక్నాలజీని కలిగి ఉన్న సైన్స్ ఆధారిత ఫార్ములా కోల్పోయిన కాల్షియంను తిరిగి నింపడంలో ఉత్తమమైనది, తద్వారా మన దంతాలు 2x బలంగా మారుతాయి*.
ప్రచారంలో ఇద్దరు తండ్రుల జీవితంలో ఒక రోజును చూపించే రెండు సినిమాలు ఉన్నాయి, అవి వరుసగా ఒకటి పట్టణ మరియు మరొకటి గ్రామీణ నేపథ్యంలో. వారు వారి సాధారణ దినచర్యను చేసుకుంటున్నారు, కాని నిర్ణీత సమయాల్లో వారు ఏదో ఒకటి తింటూనే ఉన్నారు.
తండ్రుల చర్యలను గమనిస్తున్న వారి కొడుకులు చాలా ఆందోళన చెంది నిరంతరం తినడం వల్ల దంతాలు కాల్షియంను ఎలా కోల్పోతాయో వారి తండ్రులకు తెలియజేస్తారు, మెరుగైన నోటి ఆరోగ్యం కోసం వారి దంతాలలో కోల్పోయిన కాల్షియంను పునరుద్ధరించడానికి ఏకైక పరిష్కారంగా కాల్గేట్ స్ట్రాంగ్ టీత్‌ను పరిచయం చేస్తారు.
ఈ ప్రచారంపై తన ఆలోచనలను తెలియజేస్తూ, కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గుంజిత్ జైన్ ఇలా అన్నారు, “10 మంది భారతీయులలో 8 మంది కావిటీస్‌తో బాధపడుతున్నారు, 10 మందిలో 1 మంది మాత్రమే తాము చేస్తున్నది గ్రహించారు! సమస్య యొక్క పరిధి చాలా భయంకరమైనది ఎందుకంటే మనమందరం మన పళ్లను ఆహారాన్ని రోజులో అనేక సార్లు కొరకడానికి, తినడానికి లేదా నమలడానికి ఉపయోగిస్తాము. ఇది డీమినరలైజేషన్ అని పిలువబడే ప్రక్రియ ద్వారా దంతాలు కాల్షియంను కోల్పోయేలా చేస్తుంది. తరచుగా ఏదో ఒకటి తినడం అనేది రాబోయే పండుగ సీజన్‌లో మాత్రమే పెరుగుతుంది. కోల్‌గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్‌పేస్ట్‌తో పళ్ళు తోముకోవడం మాత్రమే రక్షించగలదు! దీని ప్రత్యేకమైన అర్జినైన్ మరియు కాల్షియం బూస్ట్ టెక్నాలజీ కోల్పోయిన కాల్షియంను పునరుద్ధరించడం ద్వారా దంతాలను 2X పటిష్టంగా మార్చి తద్వారా వాటిని రీమినరలైజ్ చేస్తుంది. ఇప్పుడు మనం కావిటీస్ అభివృద్ధి చెందుతాయనే ఆందోళన లేకుండా మనకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.
ఒగిల్వీ ఇండియా నుండి హర్షద్ & కైనాజ్ “కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ అనే దాని పేరులోనే వివరణ ఉంది. కమ్యూనికేషన్‌లో మా పని దానిని వివిధ మార్గాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లడం. ఈ సంవత్సరం, మన లక్ష్యం ఏమిటంటే, మనం మన దంతాలను మనం ఉపయోగించాల్సిన దానికంటే ఎక్కువగా ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది తెలుసుకోవడం. ఎలా? రోజంతా ఏదో ఒకటి తినడం ద్వారా. ఇది భోజన ప్రియులు అని లేక తిండిపోతు అని కాదు. సినిమా చూస్తే ఈ రోజుల్లో జీవితం ఇలా ఉంటోందని అర్థమవుతుంది. కొడుకు దృష్టిలోచూస్తే, సినిమా మరియు దానితో పాటు వచ్చే పాట, ఉదయం నుండి రాత్రి వరకు ఒక వ్యక్తి తింటూ ఉండడాన్ని చెప్తుంది. ఈ భాగాన్ని చాలా సరదాగా రూపొందించిన గొప్పదనం క్రోమ్ ఫిల్మ్స్ నుండి జునెస్టన్ మథనా, కోల్‌గేట్‌లో మా ECD మరియు అమిత్ శర్మది. ఈ చిత్రం భారతదేశం అంతటా రెండు వెర్షన్లలో విభిన్న ప్రేక్షకుల నేపధ్యానికి తగినట్టుగా రూపొందించబడింది.