Saturday, November 23, 2024

కోలుకోని రూపాయి.. డాల‌ర్‌తో పోలిస్తే ప‌త‌నం దిశ‌గానే..

రూపాయి ఇంకా కోలుకోలేదు. డాలర్‌తో మారకం విలువ పతనదశలోనే ఉంది. సోమవారం కూడా అదే పరిస్థితి. కాకపోతే శుక్రవారంతో పోలిస్తే కొంత మెరుగుపడిందనే చెప్పాలి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారంనాడు 79.74గా స్థిరపడింది. ఒక దశలో 79.87దాకా వెళ్లినప్పటికీ తరువాత తగ్గడంతో రూపాయి విలువ పెరిగింది. శుక్రవారం నాడు 79.73గా ఉండగా సోమవారం 79.7తో ప్రారంభమై 79.85వరకు పెరిగింది. యూరోపియన్‌ మార్కెట్‌సహా పలు మార్కెట్‌లలో డాలర్‌ విలువ తగ్గడంతో రూపాయి బలపడినట్టయింది. అయితే దేశీయ మార్కెట్లు నష్టాలు చవిచూడటంతో పెద్దగా ఫలితం లేకపోయింది.

కాగా ఈవారాంతంలో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లు భారీగా పెంచుతున్న ఆందోళనలు మార్కెట్‌పై ఒత్తిడి తేనున్నాయి. ఆ నేపథ్యంలో రూపాయి విలువ 82 కు పడిపోవచ్చని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒడిదొడుకులకు లోనవుతున్న రూపాయిని బలోపేతం చేయడానికి విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించడానికి వెనుకాడబోమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement