Friday, October 18, 2024

Stock Market | రెండో రోజు కూడా లాభాల బాటలోనే స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. ప్రధాన కంపెనీలు తమ సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను ఈ వారం ప్రకటించనున్నందున ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు.

ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 198 పాయింట్లు పెరిగి 82,149 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 25,172 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 2 పైసలు పెరిగి 84.07 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, బజాజ్ఫిన్ సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement