దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లు హెచ్చు తగ్గులను ఎదుర్కొని చివరకు నష్టాలకు గురయ్యాయి. ఐటీ షేర్లు మంచి పనితీరు కనబరిచగా, ఇతర రంగాల షేర్లు పెద్దగా ఉత్సాహం చూపలేదు.
కాగా, నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 81,289కి పడిపోయింది. నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 24,548 వద్ద స్థిరపడింది.