దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (శుక్రవారం) భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలను నమోదు చేసిన సూచీలు ఆ తర్వాత బలంగా పుంజుకుని సానుకూలంగా ముగిశాయి.
ఉదయం 1,100 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ చివరకు 840 పాయింట్ల లాభంతో ముగియడం విశేషం. కనిష్ఠ స్థాయిల నుంచి సుమారు 2,000 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 24,750 పైగా స్థిరంగా ముగిసింది. సెన్సెక్స్ ఈ ఉదయం 81,212.45 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై ఒక దశలో 1,129 పాయింట్లు పడిపోయి 80,082.82 కనిష్ఠాన్ని తాకింది.
భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి షేర్లు 4.44% వరకు పెరిగాయి. ఇదే సమయంలో శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హిందాల్కో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వంటి 9 స్టాక్‌లు 2.44 శాతం క్షీణతతో ముగిశాయి.
సెన్సెక్స్ 30 స్టాక్‌లలో 5 మాత్రమే క్షీణించాయి. టాటా స్టీల్ (1.26% తగ్గింది). ఇండస్ఇండ్ బ్యాంక్, JSW స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ సహా మిగిలిన షేర్లు లాభాల్లోకి చేరాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ (3.96%), ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ అత్యధిక లాభాలను దక్కించుకున్నాయి.