Tuesday, November 26, 2024

టియాగో ప్రారంభ ధర రూ.8.49లక్షలు.!

భారతీయ ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్లోకి టాటామోటార్స్‌ సరికొత్త మోడల్ టియాగో ఈవీని ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.8.49 నుంచి 11.79 లక్షలు (ఎక్స్‌షోరూం ధర) గా ఉండనున్నది. మొదటి 10,000 యూనిట్లకు మాత్రమే ఈ ధరలు చెల్లుబాటు అవుతాయని టాటా సంస్థ ప్రకటించింది. ఆతర్వాత వీటి ధర ఎంత ఉంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. వీటిలో 2,000 యూనిట్లు ప్రస్తుతం ఉన్న టాటా ఈవీ యజమానులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. వచ్చే నెల 10 నుంచి బుకింగ్‌ ప్రారంభం కానున్నది. దేశీయ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ మార్కెట్‌లో ఇదే తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఈవీ కారు కావడం గమనార్హం. వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీ ఇవ్వనున్నారు. ఇందుకోసం అక్టోబర్‌ 10న టియాగో ఈవీ కార్ల బుకింగ్‌లను టాటా సంస్థ తెరువనున్నది. ఇప్పటికే నెక్సాన్‌ ఈవీ, టైగోర్‌ ఈవీ, నెక్సాన్‌ ఈవీ మాక్స్‌, నెక్సాన్‌ ఈవీ ప్రైమ్‌ మోడల్‌ కార్లతో టాటా మోటార్స్‌ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ బేస్‌ ఏర్పాటు చేసుకున్నది. టియాగో ఈవీ ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్‌ కారుగా గుర్తింపు పొందినది. ప్రస్తుతం ఏడు రకాల ఈవీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయని టాటా మోటార్స్‌ సంస్థ తెలిపింది. టియాగో ఈవీని రెండు బ్యాటరీల ప్యాక్‌లతో అందుబాటులోకి తీసుకొచ్చారు. 19.5కిలోవాట్స్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే 24కిలోవాట్స్‌ బ్యాటరీ కలిగిన కారు ధర రూ.9.09 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

కారు ప్రత్యేకతలు..

ఫుల్‌ చార్జింగ్‌ చేస్త 315 కి.మీ. ప్రయాణించొచ్చు. కేవలం 5.7 సెకన్లలోనే 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. డీసీ చార్జర్‌తో 57 నిముషాల్లోనే 10-80 శాతం బ్యాటరీ చార్జ్‌ అవుతుంది. ఫుల్‌ చార్జింగ్‌ కావడానికి 3.36 గంటలు పడుతుంది. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఎలక్ట్రిక్‌ ఓఆర్‌విఎమ్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, స్టార్ట్‌ అండ్‌ స్టాప్‌ పుష్‌ బటన్‌, లెదర్‌సీట్స్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సిటీ, స్పోర్ట్‌ డ్రైవింగ్‌ మోడ్స్‌ను ఇస్తున్నారు. రిెమోట్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ కంట్రోల్‌, రిమోట్‌ జియో ఫెన్సింగ్‌, వెహికిల్‌ ట్రాకింగ్‌ వంటి 45 కనెక్టెడ్‌ ఫీచర్లు ఉన్నాయి. 1000 కి.మీ. ప్రయాణానికి రూ.1100 ఖర్చుఅవుతుందని అంచనా. మొత్తంగా 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారెంటీ ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement