Saturday, January 18, 2025

3వ ఎడిషన్ తో తిరిగి వచ్చిన రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

హైద‌రాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ ) : సమకాలీన హిప్-హాప్ బీట్స్ తో బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన శ్రావ్యమైన గీతాలను మిశ్రమం చేసిన తమ మూడవ ఎడిషన్ కోసం సీగ్రమ్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మళ్లీ వచ్చింది. ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ప్రివ్యూలో రాబోతున్న శ్రేణిని ప్రదర్శించింది.

ఈ సందర్భంగా ఇండియాలో గ్లోబల్ బిజినెస్ డవలప్ మెంట్ హెడ్ పెర్నాడ్ రికార్డ్, ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ మొహీంద్రా మాట్లాడుతూ… రాయల్ స్టాగ్ యువతకు మ్యూజిక్ ను తమ కీలకమైన అభిరుచి మూలస్థంభంగా సంబరం చేయడం కొనసాగిస్తోందన్నారు. ఇప్పుడు తాము రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మూడవ ఎడిషన్ విడుదల చేస్తున్న సందర్భంలో ఉత్తేజభరితమైన కొత్త సౌండ్ స్కేప్ తో అనుభవాన్ని పెంచడానికి సిద్ధంగా ఉందన్నారు.

- Advertisement -

వేవ్ మేకర్ దక్షిణాసియా సీఈఓ అజయ్ గుప్తా మాట్లాడుతూ… రాయల్ స్టాగ్ నేటి యువత కోసం మ్యూజిక్ ను ఒక కీలకమైన అభిరుచి అంశంగా ఎల్లప్పుడూ భావించిందన్నారు. రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ఈ 3వ ఎడిషన్ లో తమ లివ్ ఇట్ లార్జ్ సిద్ధాంతాన్ని తాము విస్తృతం చేస్తున్నామన్నారు.

ఈఎన్ఐఎల్ సీఈఓ యతీష్ మెహ్ రిషి మాట్లాడుతూ… రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజిక్ మేజిక్ ద్వారా ప్రజలను ఒక చోట చేర్చడానికి సంబంధించిందన్నారు. ఇది వినూత్నత సంస్కృతిని కలుసుకోవడానికి, సంప్రదాయం ఆధునిక ఉద్వేగాలతో నిరంతరంగా కలుసుకోవడానికి చెందిందన్నారు. ఈఎన్ఐఎల్ లో విభిన్నతను సంబరం చేసే, మరపురాని క్షణాలను సృష్టించే ప్రత్యేకమైన విషయంపై సహకరించడానికి తాము చాలా సంతోషిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement