Friday, November 22, 2024

ఆదాయలోటు భర్తీ రాష్ట్రాల బాధ్యత..

రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న పరిహారాల విధానం జూన్‌ నెలతో ముగియనుంది. దీంతో ఇకపై ఆదాయంలో వచ్చే లోటును సదరు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు తగినట్టు ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తున్నాయి. ట్రేడ్‌, ఇండస్ట్రీ నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు పలుమార్లు జీఎస్‌టీ కౌన్సిల్‌ రేట్లను గతంలో తగ్గించింది. 28 శాతం పన్ను కిందకు వచ్చే వస్తువుల సంఖ్యను 228 నుంచి 35కు తగ్గించింది. ఐదేళ్లకు మించి పరిహారాలను ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్రాలే రెవెన్యూలను పెంచుకోవాలని భావిస్తున్నాయి.

దీనికి గల ఒకేమార్గం పన్నులను పెంచడమని జీఎస్‌టీ కౌన్సిల్‌ ముందు తమ ప్రతిపాదనలను ఉంచాయి. 5శాతం శ్లాబులోని వస్తువులు 8 శాతం శ్లాబులోకి మారిస్తే.. ఏడాదికి రూ.1.50లక్షల కోట్ల ఆదాయం అదనంగా కేంద్రానికి వస్తుంది. జీఎస్‌టీ మినహాయింపు వర్తిస్తున్న వస్తువుల సంఖ్యను కూడా తగ్గించనుండటంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement