Saturday, November 23, 2024

వచ్చే ఏడాది పెరగనున్న కార్ల ధరలు.. బీఎస్‌-6 ప్రమాణాలే కారణం

వచ్చే సంవత్సరం బీఎస్‌-6 రెండో దశ ప్రమాణాలకు అనుగుంగా కార్ల తయారీ చేయాల్సి ఉన్నందున వాటి ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్ల తయారీ సంస్థలన్నీ ఈ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంటుంది. కార్లతో పాటు, వాణిజ్య వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుంగా కంపెనీలు ఆధునిక విడిభాగాలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అందుకు అనుగుణంగా కంపెనీలు తమ వాహనాల ధరలను సమరించనున్నాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల స్థాయిని ఎప్పటికప్పుడు గుర్తించే పరికరాలను కంపెనీలు అమర్చాల్సి ఉంటుంది.

నిర్ధిష్ట స్థాయిని దాటి కాలుష్యాన్ని వెలువరిస్తే హెచ్చరిక లైట్లు వెలిగి వాహనాన్ని సర్వీస్‌కు పంపాలని సూచిస్తాయి. దీంతో పాటు మండాల్సిన ఇంధన పరిమాణాన్ని కూడా నియంత్రించాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్‌ చేసిన ప్యూయల్‌ ఇంజెక్టర్స్‌ను అమర్చాల్సి ఉంటుంది. వాహనంలో వాడే కొన్ని సెమీకండక్టర్లను కూడా అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చాలా మార్పులు చేయాల్సి రావడం వల్ల వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement