హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఊహించని విధంగా ఉల్లి ధర సెంచరీ కొట్టింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అంచనాకందని పెరుగుదలకు దగ్గరైంది. మరో నెల రోజులు వరకూ తగ్గే అవకాశాలు లేవని, కొరత తీవ్రంగా ఉందని, అందుకే ధరలు అదుపు తప్పుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు నెలల ముందు వరకు టమాటా ధరతో హడలిపోయిన సామాన్యులు ఇప్పుడు ఉల్లి ధర చూసి బేంబేలెత్తిపోతున్నారు.
ఉల్లి ధర భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి రూ.30 పలుకగా.. తాజాగా కిలో ఉల్లి రూ.80 నుంచి రూ.100 లకు చేరింది. గురువారం హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో రి-టైల్ మార్కెట్ కిలో ఉల్లి ధర రూ.100 పలికింది. దీంతో చాలా మంది ఉల్లి వినియోగం తగ్గించేసేశారు. మధ్యతరగతి కుటుంబాలు సైతం పొదుపుగా కర్రీల్లో సగం ఉల్లిగడ్డ వాడుతున్నారు.
గతంలో లాగా ఎన్ని పడితే అన్ని ఉల్లిపాయలు వాడడం లేదు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. మన దగ్గర కూడా ఉల్లి రేటు- భారీగానే పెరిగింది. నెల రోజుల్లో రూ.90 లకు పెరిగింది. ప్రస్తుతం నగరంలో ఉల్లి ధరలు రి-టైల్ మార్కెట్‌లో కిలో రూ.80 నుంచి 90 వరకు పలుకుతున్నాయి. కొన్ని వారాల క్రితం కిలో ధర రూ.20 నుంచి 25 ఉండేది.. కానీ 10 రోజుల్లోనే ధర భారీగా పెరిగింది. ధరలకు పెరుగుదలకు దిగుబడి తగ్గడమే కారణమని చెబుతున్నారు.
ఉల్లి పంటతో లాభం లేకపోవడంతో రైతులు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్లు- ఉల్లి పంట లేటు-గా వేయడంతో కొరత ఏర్పడిందని చెబుతున్నారు. హైదరాబాద్ కు మహారాష్ట్ర నుంచి ఉల్లి వస్తుంటు-ంది. అయితే ఉల్లి రాక ఆలస్యం కావడంతో ధరలు పెరుగుతున్నట్లు- వ్యాపారులు చెబుతున్నారు. దేశ రాజధానిలో ఉల్లి ధరలు మంగళవారం అధిక స్థాయిలో కొనసాగాయి. సగటు- రి-టైల్ ధర కిలోగ్రాముకు రూ.78 వద్ద స్థిరంగా ఉంది.
ఎగుమతి ఆంక్షలు విధించిన తర్వాత ప్రాథమిక సరఫరా రాష్ట్రమైన మహారాష్ట్రలో టోకు ధరలు తగ్గడం ప్రారంభించినప్పటికీ ధరలు పెరిగాయి. దేశ రాజధానిలో ఉల్లి ధరలు అక్టోబరు 25న కిలోగ్రాము రూ. 40 వద్ద ఉండగా, అక్టోబర్ 29 నాటికి రెండు రెట్లు- పెరిగి రూ.80కి చేరుకున్నాయి. మరోవైపు కేంద్రం కూడా ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్ లోకి బఫర్ స్టాక్ విడుదల చేసింది. మరో పక్క ప్రభుత్వమే రూ.25 లకు కిలో చొప్పున ప్రజలకు విక్రయిస్తోంది. దీంతో ప్రభుత్వ విక్రయకేంద్రాల వద్ద ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు.