పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం రెండవ విడత అమలుకు మరోసారి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎంపిక చేసింది. ఇప్పటివరకు దేశంలో ఇదే అతిపెద్ద మిషన్ క్రిటికల్ ఈ-గవర్నమెంట్ ప్రోగ్రాం కానుంది. మరో తొమ్మిదిన్నరేళ్లపాటు ఈ ప్రాజెక్ట్‌ను టీసీఎస్ నిర్వహించనుంది. 11.5 ఏళ్ల వరకు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని టీసీఎస్ తెలిపింది. కానీ ఒప్పందం ఫైనాన్సియల్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ ఒప్పందం విలువ రూ.6000 కోట్ల నుంచి రూ.8000 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా ఉంది.
తదుపరి దశలో ప్రస్తుతమున్న సౌలభ్యాలు, వ్యవస్థలను టీసీఎస్ పక్కన పెట్టనుంది. ఈ పాస్‌పోర్ట్ జారీకి బయో మెట్రిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అడ్వాన్స్‌డ్ డేటా అనలిటిక్స్, చాట్‌బాట్స్, ఆటో రెస్పాన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రోసెసింగ్, క్లౌడ్ వంటి టెక్నాలజీతో కొత్త సొల్యూషన్లు అభివృద్ధి చేయనుంది. మరోవైపు షేర్ బైబ్యాక్‌ను పరిశీలించనున్నట్టు టీసీఎస్ ప్రకటించింది. ఈ మేరకు జనవరి 12న బోర్డ్ సమావేశం జరనున్నట్టు తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital