Friday, November 22, 2024

ఫేస్‌బుక్ కు తగ్గిన యూజర్ల సంఖ్య..

సామాజిక మాధ్యమంలో తిరుగులేని ఆదరణ పొందిన ఫేస్‌బుక్‌కు తొలిసారి షాక్‌ తగిలింది. గత సంవత్సరం యాక్టీవ్‌ యూజర్ల సంఖ్య తగ్గింది. మొబైల్‌ డేటా రేట్లు పెరగడం వల్లే యూజర్ల సంఖ్య తగ్గిందని ఫేస్‌బుక్‌ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఇది పైకి చెప్పిన మాట మాత్రమే. రెండేళ్లపాటు భారత్‌లో నిర్వహించిన సర్వే వివరాలు బయటకు వచ్చాయి. భద్రత, గోప్యతపై భయాల మూలంగా మన దేశానికి చెందిన మహిళలు ఫేస్‌బుక్‌ పట్ల ఆసక్తి చూపించడంలేదని తేలింది.

గోప్యత విషయంలో మహిళలు ఎక్కువ ఆందోళనగా ఉన్నట్లు ఫేస్‌బుక్‌ సర్వేలో వెల్లడైంది. 20 నుంచి 30 శాతం మంది మహిళలు ఫేస్‌బుక్‌లో ఎక్కువ నగ్న దృశ్యాలు కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. గోప్యతను కాపాడేందుకు ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ లాక్‌ ఆప్షన్‌ తీసుకు వచ్చింది. దీన్ని 34 శాతం మంది మహిళలు ఉపయోగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement