ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటం సుదీర్ఘమైనది, దృఢమైనదని ఆర్బీఐ అన అక్టోబర్ బులిటెన్‌లో అభిప్రాయపడింది. ఇది అనిశ్చితో జరుగుతున్న పోరటామని, ఇందులో ద్రవ విధాన నిర్ణయాలతో ఒక్కొ అడుగు ముందుకు వెసుకుంటూ వెళ్లాల్సి ఉందని పేర్కొంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) సెప్టెంబర్‌లో 7.4 శాతం, ఆగస్టులో 7.0 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 8.4 శాతంగా నమోదైంది. అది ఆగస్టులో 7.6 శాతంగా ఉంది.
ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందని, లక్ష్యానికి అనుగుణంగా దీన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. సెప్టెంబర్‌లో తయారీ రంగంలో అన్ని విభాగాల్లోనూ ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిందిని పేర్కొంది. దీని వల్ల అమ్మకం ధరలు పెరిగాయి. దీంతో పాటు సర్వీస్ సెక్టర్‌లోనూ ధరలు పెరుగుదల నమోదైంది.
వాస్తవ జీడీపీ పెరుగుదల రానున్న త్రైమాసికంలో సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. దిగువస్థాయిలో చేస్తున్న ప్రయత్నాలు సరైన ఫలితాలు ఇవ్వడంలేదని తెలిపింది. కోవిడ్ సమయంలో కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, ఈ రంగాలు నెమ్మదిగా కోలుకుంటున్నాయని తెలిపింది. పండగల సీజన్‌లో వినియోగదారుల డిమాండ్ మూలంగా, దాని ప్రభావం వినియోగం పెరిగేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. మన ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల, ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వనున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. ధరల స్థిరీకరణ, ఆర్ధిక సుస్థిరత సాధించేందుకు, ఆర్ధిక వృద్ధిరేటు పెంచేందుకు చేస్తున్న కృషి కొనసాగుతుందని చెప్పారు.