ప్రపంచ డిమాండ్ మందగించడం, చైనా లాక్డౌన్ ఆంక్షల అనిశ్చితి కారణంగా నవంబర్‌లో ఆసియా అంతటా ఫ్యాక్టరీ ఉత్పత్తి విస్తృతంగా క్షీణించిందని ప్రైవేట్ సర్వేలు గురువారం పేర్కొన్నాయి. లాక్డౌన్లు అంతర్జాతీయ సరఫరాకు అంతరాయం కలిగించి, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మరింత పతనానికి గురవుతుందనే భయాలను పెంచుతున్నందున, ఫలితాలు 2023 కోసం ఆసియా చీకటి ఆర్థిక దృక్పథాన్ని హైలైట్ చేశాయి. మహమ్మారి నియంత్రణల మధ్య, నవంబర్‌లో చైనా ఫ్యాక్టరీ కార్యకలాపాలు తగ్గిపోయాయని ఒక ప్రైవేట్ సర్వే తెలిపింది. ఫలితంగా నాల్గవ త్రైమాసికంలో బలహీనమైన ఉపాధి, ఆర్థిక వృద్ధిని సూచించింది. జపాన్, దక్షిణ కొరియాతో సహా ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలలో, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో తయారీ కార్యకలాపాలు తగ్గాయి.
”శీతలీకరణ మార్కెట్ పరిస్థితులు, స్థిరమైన వ్యయ ఒత్తిళ్లు, బలహీనమైన అంతర్లీన డిమాండ్, దేశీయంగా.. అంతర్జాతీయంగా పారిశ్రామిక ఉత్పత్తి క్షీణతకు ప్రధాన కారణాలుగా నివేదించబడ్డాయి” అని జపాన్‌పై సర్వేను సంకలనం చేసిన ఆర్థికవేత్త లారా డెన్మాన్ అన్నారు. దక్షిణ కొరియా ఫ్యాక్టరీ కార్యకలాపాలు నవంబర్‌లో వరుసగా ఐదవ నెలకు పతనం అయ్యాయి. ఎగుమతులు రెండున్నరేళ్లలో అత్యధిక వార్షిక తగ్గుదలని చవిచూశాయి. చైనా కష్టాల ప్రభావం ఆసియా అంతటా విస్తృతంగా కనిపించింది. తైవాన్ పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో 41.6 వద్ద ఉంది. అక్టోబర్‌లో 41.5 నుండి కొద్దిగా పెరిగింది. వియత్నాం పారిశ్రామి కార్యకలాపాలు అక్టోబర్‌లో 50.6 నుండి నవంబర్‌లో 47.4కి పడిపోయాయి. ఇండోనేషియాలో 51.8 నుండి 50.3కి పడిపోయిందని ప్రైవేట్ సర్వేలు చూపించాయి.