Wednesday, December 18, 2024

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది.బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనుండటంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.

సెన్సెక్స్ ఉదయం 81,511.81 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 81,748.57) నష్టాలతో ప్రారంభమై రోజంతా అదే నెగటివ్‌ ట్రెండ్‌ను కొనసాగించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ కనిష్ఠంగా 80,612.20 పాయింట్లను తాకింది. చివరికి 1,064 పాయింట్ల భారీ నష్టంతో 80,684 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 322 పాయింట్లు కోల్పోయి 24,336 వద్ద స్థిరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement