దక్షిణ కొరియాలోని అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్, దానిసోదర సంస్థ కియా 2023లో 2 మిలియన్ యూనిట్ల ఎగుమతులను పోస్ట్ చేయబోతున్నాయని ఇవ్వాల (ఆదివారం) ఓ నివేదిక వెల్లడించింది. కొరియా ఆటోమొబైల్, మొబిలిటీ అసోసియేషన్ ప్రకారం, జనవరి-అక్టోబర్ కాలంలో హ్యుందాయ్, కియా 9,45,062, 867,136 యూనిట్లను ఎగుమతి చేసినట్టు తెలుస్తొంది. ఈ డేటాని 2022లో ఇదే కాలంతో పోలిస్తే 17.5 శాతం పెరిగింది.
రెండు కార్ల తయారీదారుల నెలవారీ 1,80,000 యూనిట్ల షిప్‌మెంట్‌లను పరిశీలిస్తే, 2023లో వారి విదేశీ అమ్మకాలు 2016 తర్వాత మొదటిసారిగా 2 మిలియన్ యూనిట్లకు మించి ఉంటాయని పరిశ్రమ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల కార్లకు డిమాండ్ ఉందని హ్యుందాయ్ మోటార్ గ్రూప్ అధికారి ఒకరు తెలిపారు. విక్రయించిన కార్ల సగటు ధర 24,000 డాలర్లకి చేరుకుంది. ఇది 2016లో 14,000 వేల డాలర్లుగా ఉండేది. అంటే ధరల పరంగా 68 శాతం పెరుగుదల నమోదైంది.