Tuesday, November 19, 2024

పత్తి దిగుమతులపై సుంకాలు ఎత్తివేత.. సెప్టెంబర్ 30వరకు మినహాయింపు

పత్తి దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాలు సెప్టెంబర్‌ 30వరకు మినహాయిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. 2022 సెప్టెంబర్‌ 30వరకు పన్నులు మినహాయిస్తున్నట్లు ఆర్థికమంత్రిత్వశాక బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మినహాయింపు 14ఏప్రిల్‌ నుంచి అమలవుతుందని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మినహాయింపు ద్వారా టైక్స్‌టైల్‌ పరిశ్రమలు, వస్త్రవ్యాపారులు లబ్ధి చేకూరనుంది. ఇంతకుముందు పత్తి దిగుమతులపై 5శాతం కస్టమ్స్‌ సుంకాలు విధించేవారు. దీంతోపాటు మరో 5శాతం అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ (ఏఐడీసీ) 5శాతం విధించేవారు.

దేశంలోని చిన్న తరహా పరిశ్రమలకు ఈ పన్నులు రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది నుంచి కాటన్‌ ఇండస్ట్రీ ప్రభుత్వం తమపై పన్నులను రద్దు చేసి భారతీయ టెక్స్‌టైల్‌, వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కోరుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement