Wednesday, November 20, 2024

ట్విటర్‌ ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన కేంద్రం

ట్విటర్‌ ఇండియాలో ఉద్యోగుల తొలగింపును కేంద్ర ప్రభుత్వం ఖండించింది. వారికి కొంత సమయం ఇవ్వాలని కోరింది. ఉద్యోగులను తొలగించాలని ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఖండించారు. ఉద్యోగులను తొలగించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. వారికి కొంత సమయం ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇండియాలోపని చేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతానికిపైగా ట్విటర్‌ తొలగించింది. ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌ ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు.

ఇండియాలో 230 మంది ఉద్యోగులు ట్విటర్‌లో పని చేస్తున్నారు. వీరిలో 180 మందికిపైగా తొలగించారు. కొన్ని విభాగాల్లో ఉన్న మొత్తం ఉద్యోగులను తొలగించారు. మార్కెటింగ్‌, పబ్లిక్‌ పాలసీ, కార్పోరేట్‌ కమ్యూనికేషన్‌ వంటి విభాగాల్లో చాలా మందిని తొలగించారు. అమెరికాలోని కేంద్ర కార్యాలయంలో 3,700 మందికిపైగా ఉద్యోగులను ఎలాన్‌ మస్క్‌ తొలగించారు.

కొందరిని మళ్లి పిలిచిన మస్క్‌

అమెరికాలోని ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో కొంత మందిని పొరపాటున తొలగించామని వారు మళ్లి ఆఫీస్‌కు రావాలని మస్క్‌ వారికి ఇ-మెయిల్‌లో మేసేజ్‌ పంపించారని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాలో కొన్ని పొరపాట్లు వచ్చయని, కొంత మంది నైపుణ్యాన్ని, అనుభవాన్ని గుర్తించడంలో పొరపాట్లు జరిగాయని మస్క్‌ వారికి పంపించిన సందేశంలో పేర్కొన్నారు.

నకిలీ ఖాతాలు తొలగిస్తాం

- Advertisement -

గతంలో నకిలీ ఖాతాలు ఉన్నాయని, వాటి సమాచారం ఇవ్వడంలేదన్న కారణంతోనే ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. చివరకు ఆయన దాన్ని 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. తాజాగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని చాలా మంది ట్విటర్‌లో ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో తాజాగా ఆయన దీనిపై స్పందించారు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే నకిలీ ఖాతాల్ని శాశ్వతంగా రద్దు చేస్తామని ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు. నకిలీ ఖాతా అని సూచించేలా ప్రత్యేకంగా పేరడీ అని పేర్కొన్న ఖాతాలను మాత్రం వదిలేస్తామన్నారు.

ఇప్పటి వరకు నకిలీ ఖాతాలకు కూడా బ్లూ టిక్‌ ఉండటాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇక నుంచి పక్కాగా వెరిఫికేషన్‌ చేసిన తరువాతే బ్లూ చెక్‌ మార్క్‌ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నుంచి నకిలీ ఖాతాలకు బ్లూ టిక్‌ ఉండే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement