కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,39,750 కోట్ల పన్నులను పంపిణీ చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు 25,066.88 కోట్లు, బీహార్‌కు 14056.12 కోట్లు, మధ్యప్రదేశ్‌కు 10,970.44 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు 10,513.46 కోట్లు విడుదలయ్యాయి.
ఇక ఏపీకి 5655.72 కోట్లు, తెలంగాణకు రూ.2937.58 కోట్లు మంజూరయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.