Saturday, November 23, 2024

బుల్లెట్ ట్రైన్ ఊసే లేదుగా…! ఇప్పుడే చెప్పలేమన్న రైల్వే అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భూ సేకరణలో జాప్యం వల్లా, కోవిడ్‌ మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత మాత్రమే బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ ని నిర్ణయించగలమని రైల్వే అధికారులు అన్నారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకి సంబంధించి ఆర్‌.టి.ఐ అభ్యర్ధనకు, థానేకు చెందిన కార్యకర్తల సమాచార హక్కు చట్టం పిటిషన్‌కూ నేషనల్ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌.హెచ్‌.ఆర్‌.సి.ఎల్‌) అధికారులు ఈ విధంగా స్పంధించారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుని 2023 కల్లా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని, అందుకు సంబంధించి ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత పరి స్థితుల్లో కోవిడ్‌ 19 ప్రభావాన్నీ, లాక్‌ డౌన్‌ సమయాన్నీ అంచనా వేసిన తరువాత మాత్రమే అధికారికంగా బులెట్‌ రైలు ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోగలమని పేర్కొన్నారు. అంతే కాకుండా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలోని భూసేకరణలో జాప్యం జరిగిందనీ, ప్రాంతాల వారీగా రైలు ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిగిన తరువాతే రైలు ప్రాజెక్టు పై నిర్థిష్టమైన నిర్ణయం తీసుకోగలమన్నారు.

అందుకు సంబంధించి భూమి సేకరణ పనులను వేగవంతం చేసినట్లు స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాలకూ, వన్య ప్రాణులు నివసించే ప్రాంతాకూ, తీర ప్రాంతలకూ ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండే అనువైన చోటే బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ పడుతుందనీ, అందుకోసం అనుమతులు కూడా తీసుకున్నామన్నారు. ఇప్పటివరకూ 297 గ్రామాలకు సంబంధించి జాయింట్‌ మేజర్‌ సర్వేలు పూర్తయ్యాయనీ, భూసేఖరణకి అవ సరమైన 1400 హెక్టార్లలో 1200 హెక్టార్ల భూమిని సేఖరించామన్నారు. 1.10 లక్షల కోట్లు ఖర్చయ్యే ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో ఇప్పటి వరకూ 26,872 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement