Friday, November 22, 2024

ఎలాన్‌ మస్క్‌కు టెస్లా షాక్‌.. ఒక్క రోజే 1.64 లక్షల కోట్లు నష్టం

అంతర్జాతీయ మార్కెట్ల భారీ పతనంతో ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగింది. ఆయన సంపద ఒక్కరోజే 1.64 లక్షల కోట్లు (20.3 బిలియన్‌ డాలర్లు) అవిరైంది. ఇంత భారీగా నష్టపోయిన ప్పటికీ ఆయన ప్రపంచ కుబేరుడిగా ఆయన ఇంకా అగ్రస్థానంలోనే ఉన్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు తగ్గించాలని ఆలోచిస్తున్నట్లు టెస్లా ప్రకటించింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నందున విద్యుత్‌ వాహనాల ధరలు తగ్గించక తప్పదని ఎలాన్‌మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనతో గురువారం నాడు అమెరికా మార్కెట్లలో టెస్లా షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి.

టెస్లా షేరు ధర 9.7 శాతం నష్టపోయింది. దీని ఫలితంగా మస్క్‌ సంపద ఒక్క రోజులోనే 20.3 బిలియన్‌ డాలర్ల నష్టపోయారు. దీనింతో ఆయన నికర సంపద బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం 234.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గురువారం నాడు ట్రేడింగ్‌లో అమెరికా నాస్‌డాక్‌ 100 సూచీలు నష్టపోయింది.

దీంతో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెెజోస్‌తో పాటు ఒరాకిల్‌కు చెందిన లారీ ఎల్లిసన్‌, మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈఓ స్టీవ్‌ బాల్మెర్‌, మెటా అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌, అల్ఫాబెట్‌ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ నికర సంపదలు కూడా భారీగా తగ్గిపోయాయి. వీరంతా కలిసి ఒక్క రోజే 20.8 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయారు. ఎలాన్‌ మస్క్‌ తరువాత రెండో స్థానంలో ఉన్న ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ కు, అగ్రస్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్‌కు ప్రస్తుతం 33 బిలియన్‌ డాలర్ల తేడా మాత్రమే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement