అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండియా – చైనా సరిహద్దుల్లో ఉన్న ఆంజోయు జిల్లాలోని భారత భూభాగంలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు 11.30 ఏఎం, 2పీఎం అంటూ బీజింగ్ టైముతో రెండు టైమ్ జోన్లను సూచిస్తోంది. ఒకటి ఇండియా సెటిల్‌మెంట్ బోర్డర్ కిబిత్యు కాగా, మరోటి చైనా ఉత్తర సరిహద్దు భూభాగం ఆంజోయు కావడం గమనార్హం. కిబిత్యులో ఒక్క ఇండియా ఫోన్ కానీ, ఇంటర్నెట్ సౌకర్యంగానీ లేదు. కానీ, చైనాకు చెందిన నాలుగు టెలికం నెట్‌వర్క్ 5జీ సూచిస్తోండడం విశేషం. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో జనవరి 11, 2021న డీలిస్ట్ చేసిన కంపెనీ సైతం చైనా మిలటరీకి పలు కనెక్షన్లను మంజూరు చేసింది. దీంతో, కిబిత్యు సమీపంలో ఇంటర్నేషనల్ రోమింగ్ ఆప్‌షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో, చైనా టెలికం నెట్‌వర్క్, స్థానిక నెట్ వర్క్ ను వ్యాపారస్థులు తీసుకుంటున్నారు.
బైట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రెండు నెట్‌వర్క్ లవసరమని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. చైనా సరిహద్దుల్లో టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీ ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఇండియా ప్రభుత్వం కూడా టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక అమలు చేస్తోంది. రహదార్లు, ఇతరమౌలిక వసతులు ఏర్పరర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టెలికాం సేవల కోసం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయడానికి తగిన రోడ్లను భారత ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తద్వారా మెరుగైన 4జీ ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పించడానికి అవకాశం ఉంది. ఈశాన్యరాష్ట్రాల్లో మౌలిక వసతులను కల్పించడానికి పలు అభివృద్ధి పెనులు చేపట్టడంతో పాటు, కొత్త రేడియో సెట్స్ శాటిలైట్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈశాన్య అరుణాచల్‌ప్రదేశ్ మౌంటెన్ బ్రిగేడ్ బ్రిగేడియర్ టీఎం సిన్హా ప్రకటించారు.