Saturday, November 23, 2024

క్రికెట్ ఫ్యాన్స్ కు టెలికాం కంపెనీల బంప‌ర్ ఆఫ‌ర్.. వరల్డ్ కప్ కోసం కొత్త ప్లాన్లు

భారత్‌లో క్రికెట్ ప్రపంచకప్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ టోర్నీలో ప్రపంచం నలుమూలల నుంచి అనేక జట్లు పాల్గొంటున్నాయి. భారత్ మొట్టమొదటిసారి ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు పూర్తిగా ఆతిథ్యం అందించనుంది. దేశంలోని రెండు ప్రధాన టెలికాం కంపెనీలు, ఎయిర్‌టెల్, జియో తమ యూజర్ల కోసం ఇంటర్నెట్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి.

ఎయిర్‌టెల్ రెండు డేటా ప్లాన్‌లు

రూ. 99 ప్రత్యేక ప్లాన్‌ను ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా మీకు రెండు రోజుల పాటు అపరిమిత డేటా సౌకర్యం లభిస్తుంది. అలాగే 6 జీబీ డేటాను ఒక రోజుకు రూ. 49కి అందిస్తారు. ఇది కాకుండా మీకు ఇష్టమైన భాషలో క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసే సౌకర్యం ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బాక్స్‌లో అందించనున్నారు.

జియో రూ. 328 ప్లాన్

- Advertisement -

జియో బేసిక్ ప్లాన్ రూ. 328కి వస్తుంది. ఇందులో 28 రోజుల పాటు ప్రతిరోజూ 1.5 GB హై స్పీడ్ డేటా అందించనున్నారు. ఈ ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మూడు నెలల పాటు రానుంది.

జియో రూ. 758 ప్లాన్

ఇది కాకుండా జియో రూ. 758 ప్లాన్‌ను అందిస్తుంది. దీనిలో ప్రతిరోజూ 1.5 జీబీ హై స్పీడ్ డేటా లభించనుంది. ఈ ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఇస్తారు.

జియో రూ.388, రూ.808 ప్లాన్‌లు

అదేవిధంగా రూ.388, రూ.808 ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా అందించబడుతుంది. రూ. 388 ప్లాన్ 28 రోజుల వాలిడిటీని కలిగి ఉండగా, రూ.808 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఈ ప్లాన్ ద్వారా కూడా డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement