హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సంస్థ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటెట్), బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీతో ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణలో ఉన్న పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల్లో టెక్నాలజీ అనేబుల్డ్ లేబరేటరీలు డిజైన్ చేయడం, అభివృద్ధి చేస్తారు. బిట్స్ ఫిలానీకి చెందిన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (విల్స్) కింద వీటిని చేయనున్నారు. బిట్స్ పిలానీ పలు రిమోట్, వర్చువల్ ల్యాబ్స్‌ను డిజైన్ చేసి అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకు వచ్చిందని బిట్స్ పిలానీ క్యాంపస్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీ. సుందర్ తెలిపారు. వర్క్ ఇంటిగ్రేటెడ్ అభ్యాస కార్యక్రమాల కోసం , వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని ఇతర విద్యార్ధులు ఉపయోగించుకునేకు ఈ ఒప్పందం వీలుకల్పిస్తుందని చెప్పారు.
సాంకేతిక విద్యలో మన విద్యార్ధులు నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అనుభపూర్వక శిక్షణ అవసరమని సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఉన్న వర్చువల్, రిమోట్ ల్యాబ్‌లు అవసరమైన అనుభవాన్ని అందిస్తాయని చెప్పారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఉన్న ల్యాబ్స్‌ను నవీన్ మిట్టల్ పరిశీలించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.