Friday, November 29, 2024

2030నాటికి నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని నిర్మించడంపై దృష్టి సారించిన తెలంగాణ

హైద‌రాబాద్, (ఆంధ్రప్రభ) : నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌లకు అనుగుణంగా తెలంగాణ తన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి పరివర్తనాత్మక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల విడుదలైన బ్రిడ్జింగ్ ది గ్యాప్: ఇంటిగ్రేటింగ్ స్కిల్లింగ్ ఇన్‌టు తెలంగాణస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిపోర్ట్ ను ఈవై-పార్థెనాన్ సహకారంతో సిఐఐ తెలంగాణ రూపొందించింది.

రాష్ట్ర విద్యారంగానికి సంబంధించిన సమగ్ర విశ్లేషణను ఇది అందిస్తుంది. మారుతున్న పోకడలు, సవాళ్లు, అవకాశాలను ఇది వెల్లడించటంతో పాటుగా వృత్తి శిక్షణ, పరిశ్రమ-సమలేఖన నైపుణ్యాలను పాఠ్యాంశాల్లోకి చేర్చవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.

ఈ నివేదిక గురించి ఈవై -పార్థెనన్ భాగస్వామి డాక్టర్ అవంతిక తోమర్ మాట్లాడుతూ… సాంప్రదాయ విద్యా నమూనాల్లో నైపుణ్య విద్య, వృత్తి శిక్షణను మిళితం చేయటం భారతదేశంతో సహా దేశం ఎదుగుదలకు, పోటీతత్వానికి కీలకమన్నారు. జాతీయ జీడీపీ వృద్ధిని మించి తెలంగాణ అత్యధిక వృద్ధిని నమోదు చేసిందన్నారు.

సిఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్ నొక్కిచెబుతూ… తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక విధాన సిఫార్సుల కోసం సిఐఐ స్థిరంగా కృషి చేస్తోందన్నారు. తాము దృష్టి పెడుతున్న ముఖ్యాంశాల్లో ఒకటి పరిశ్రమల ఇంటర్న్‌షిప్‌ల ఏకీకరణ, విద్యార్థులకు మాత్రమే కాకుండా, అధ్యాపకులకు కూడా ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయడం ద్వారా, అధ్యాపకులు పరిశ్రమ ధోరణులతో మరింత సన్నిహితంగా ఉండేలా చూస్తామన్నారు. తద్వారా అకాడెమియా, పరిశ్రమల మధ్య అంతరాన్ని భర్తీ చేయడం, ఆవిష్కరణలను నడిపించటం, దీర్ఘకాలంలో ఉపాధిని పెంచటం దీంతో సాధ్యమవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement