Friday, November 22, 2024

టీసీఎస్‌ క్యు4 లాభం, 9,926 కోట్లు.. అందుకోని కంపెనీ అంచనాలు

భారతదేశపు అతిపెద్ద ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) క్యు4 (జనవరి-మార్చి) ఫలితాలను సోమవారం ప్రకటించింది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ పరంగా నికర 7.4 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో.. రూ.9,246 కోట్లు గడించగా.. ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 7.4 శాతం పెరిగి.. రూ.9,926 కోట్లకు చేరుకుందని టీసీఎస్‌ ప్రకటించింది. అయితే ఐటీ రంగ నిపుణులు టీసీఎస్‌ క్యు4 లాభం రూ.9,890 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఆదాయం గురించి తెలుసుకుంటే.. ఈ త్రైమాసికంలో ఆదాయం గతేడాది క్యు4తో పోలిస్తే.. 15.75 శాతం పెరిగి.. రూ.50,591 కోట్లకు చేరింది. ఆదాయపరంగా ఐటీ రంగ నిపుణుల అంచనా రూ.50,070 కోట్లుగా ఉండింది. గతేడాది జనవరి-డిసెంబర్‌ కాలంలో.. రూ.43,705 కోట్ల ఆదాయాన్ని కంపెనీ తన ఖజనాలో జమ చేసుకుంది.

బ్లూమ్‌బర్గ్‌ మాత్రం టీసీఎస్‌ రెవెన్యూ రూ.50,249 కోట్లు ఉంటుందని, క్యు4 నికర లాభం రూ.10,077 కోట్లు నమోదవుతుందని అంచనా వేసింది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్‌ షేర్లు 0.36 శాతం లాభాలను తెచ్చిపెట్టింది. రూ.3,699 వద్ద ముగిసిందని టీసీఎస్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. 2022లో ఇప్పటి వరకు టీసీఎస్‌ స్టాక్‌.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో దాదాపు 10 శాతం డ్రాప్‌తో పోలిస్తే.. దాదాపు 3 శాతం తగ్గింది. కాన్సెటెన్సీ కరెన్సీ టర్మ్స్‌ పరంగా.. మార్చి త్రైమాసికంలో ఆదాయం 14 శాతం పెరిగింది. డాలర్‌ పరంగా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 12 శాతం వృద్ధిని చూపుతూ.. 6,696 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా టీసీఎస్‌ బోర్డు డివెండ్‌పై కీలక సిఫార్సు చేసింది. ఈక్విటీ షేర్‌కు రూ.22 ఫైనల్‌ డివిడెంట్‌ను అందజేసేందుకు సిఫార్సు చేసింది.

ఈ సందర్భంగా టీసీఎస్‌ ఎండీ, సీఈఓ రాజేశ్‌ గోపినాథన్‌ మాట్లాడుతూ.. 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని ఎంతో బలమైన వృద్ధితో ముగించామన్నారు. తమ కంపెనీలో కస్టమర్స్‌ పెరుగుతున్నారని, సేవలు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఆల్‌ టైమ్‌ హై ఆర్డర్‌ బుక్‌తో ముందుకు సాగడం కోసం బలమైన, స్థిరమైన పునాదిని అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ కస్టమర్లకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. భవిష్యత్తులో సరికొత్త సేవలతో ముందుకు వస్తాయని, కంపెనీపై కస్టమర్లు పెట్టుకున్న నమ్మకాన్ని అలాగే కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. కంపెనీ అత్యధిక ఆర్డర్‌ బుక్‌ టీసీవీ (మొత్తం కాంట్రాక్‌ ్ట విలువ) క్యు4లో 11.3 బిలియన్‌ డాలర్లు ఉండగా.. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆర్డర్‌ బుక్‌ విలువ 34.6 బిలియన్‌ డాలర్లుగా నిలిచిందని తెలిపారు. దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీ టీసీఎస్‌ అని, అంతకుముందు డిసెంబర్‌ త్రైమాసికం (క్యు3)తో పోలిస్తే.. 25 శాతం ఫ్లాట్‌ ఆపరేటింగ్‌ మార్జిన్‌లను నివేదించగా.. నికర మార్జిన్‌ 19.6 శాతంగా ఉందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement