Friday, September 20, 2024

TATA TEA: తెలంగాణలో టీ నాణ్యతపై టాటా టీ జెమినీ అవగాహన కార్యక్రమం

హైద‌రాబాద్: తెలంగాణలో ఎక్కువ మంది అభిమానించే టీ బ్రాండ్, టాటా టీ జెమినీ, టీ నాణ్యత ఆవశ్యకత గురించి తెలపటంతో పాటుగా ప్యాకెట్ల రూపంలో కాకుండా కల్తీ లేదా రంగుతో కూడి వదులుగా విక్రయించే టీ వల్ల కలిగే నష్టాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఒక కార్యక్రమంను ప్రారంభించనుంది. విశ్వసనీయ బ్రాండ్ నుండి సురక్షితమైన, అధిక-నాణ్యత కలిగిన ప్యాకేజ్డ్ టీ వైపు మారడాన్ని ప్రోత్సహించడం, అటువంటి పద్ధతుల దుష్ప్రభావాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం టాటా టీ జెమిని లక్ష్యం.

ఈసంద‌ర్భంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (ఇండియా అండ్ సౌత్ ఆసియా) ప్యాకేజ్డ్ బెవరేజెస్ ప్రెసిడెంట్ పునీత్ దాస్ మాట్లాడుతూ…. టాటా టీ జెమినీ వద్ద గొప్ప నాణ్యమైన కప్పు టీని డెలివరీ చేయడం కంటే ఎక్కువగా త‌మ నిబద్ధత ఉంటుందన్నారు. ఇది త‌మ వినియోగదారుల భద్రత అండ్ శ్రేయస్సును నిర్ధారించడానికి విస్తరించిందన్నారు. కల్తీ టీ వల్ల కలిగే సంభావ్య నష్టాల గురించి తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించడం, సాధికారత కల్పించడం పూర్తి సమాచారంతో తగు నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించటం త‌మ అవాగాహన కార్యక్రమ లక్ష్యమ‌న్నారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అడ్డూ కిరణ్మయి మాట్లాడుతూ… ఈ ప్రాంతంలోని తెలుగు గృహాలలో టీ అనేది చాలా ముఖ్యమైన పానీయం, రోజులో చాలాసార్లు ఈ టీ తాగటాన్ని ఆనందిస్తారన్నారు. తగిన రీతిలో సమాచారం పొందటం, జాగ్రత్తగా ఉండటం ద్వారా, వినియోగదారులు కల్తీ టీని తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి తమను తాము రక్షించుకోవచ్చన్నారు. స్వచ్ఛమైన, అధిక-నాణ్యత కలిగిన ప్యాకేజ్డ్ టీ ప్రయోజనాలను ఆస్వాదించడం కొనసాగించవచ్చన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement