Tuesday, November 19, 2024

అత్యాధునిక ఫీచర్లతో టాటా పంచ్‌.. మార్కెట్ లో సీఎన్జీ వేరియంట్

ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ మైక్రో ఎస్‌వీయ మోడల్‌ పంచ్‌ ఐసీఎన్‌జీ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఐజీఎన్‌జీ ఢిల్లిdలో ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర 7.1 లక్షలుగా టాటా మోటార్స్‌ తెలిపింది. ఇందులో హై ఎండ్‌ వేరియంట్‌ మోడల్‌ ధర 9.68 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. టాటా మోటార్స ఐసీఎన్జీ పంచ్‌లో ట్విన్‌ సిలిండర్‌ టెక్నాలజీని ఉపయోగించింది.

కొత్తగా ఇందులో కొన్ని భద్రతపరమైన ఫీచర్లను తీసుకు వచ్చింది. ఫ్యూయల్‌ నింపే సమయంలో ఇంజిన్‌ కటాఫ్‌ అయ్య విధంగా మైక్రో స్విచ్‌ సదుపాయాన్ని తీసుకు వచ్చింది. దీనితో పాటు థర్మల్‌ ఇన్సిడెంట్‌ ప్రొటెక్షన్‌ ఇంజిన్‌కు సీఎన్‌జీ సరఫరాను నిలిపివేసి, ఆ గాస్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త పంచ్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌ ఆధారిత ఎలక్ట్రిక్‌ సన్‌ రూఫ్‌ను ఇస్తున్నారు. ఆటోమేటిక్‌ ప్రొజక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, 6 అంగుళాల డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఉంటాయి. 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఇస్తున్నారు. ఇది అండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది.

- Advertisement -

రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, డ్రైవర్‌ సీటు హైట్‌న అడ్జస్ట్‌ చేసుకోవడం వంటి ఆధునిక పీచర్లు ఉన్నాయి. పంచ్‌లో తీసుకు వచ్చిన ట్విన్‌ సిలిండర్‌ టెక్నాలజీని టియాగో, టిగోర్‌ మోడళ్లలోనూ తీసుకొచ్చినట్లు టాటా మోటార్స్‌ తెలిపింది.టియాగో సీఎన్‌జీ ధర 6.55 లక్షల నుంచి 8.1 లక్షలు, టిగోర్‌ సీఎన్‌జీ ధర 7.8 లక్షల నుంచి 8.95 లక్షల వరకు ఉంటుందని తెలిపింది. వీటితో కంపెనీ సీఎన్జీ లైనప్‌ మరింత బలోపేతం అవుతుందని టాటా మోటార్స్‌ పాసింజర్‌ వెహికల్‌ మార్కెటింగ్‌ హెడ్‌ వినయ్‌ మంత్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement