Saturday, November 23, 2024

అమ్మకాల్లో ‘టాటా పంచ్‌’ రికార్డులు.. పది నెలల్లోనే లక్ష వాహనాల తయారీ..

టాలా మోటార్స్‌ ఎస్‌యూవీ వాహనం ”పంచ్‌” రికార్డులు సృష్టిస్తోంది. టాటా మోటార్స్‌ విడుదల చేసిన పది నెలల్లోనే లక్ష వాహనాల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. లక్షవ ”పంచ్‌” వాహనాన్ని తయారుచేసి డీలర్లకు పంపినట్లు టాటా మోటార్స్‌ కంపెనీ ప్రకటించింది. అతి తక్కువ కాలంలో అత్యధిక ఎస్‌యూవీలను విక్రయించడంలో పంచ్‌ రికార్డు నమోదు చేసింది. అంతర్జాతీయ క్రాష్‌ టెస్ట్‌లో ఐదు స్టార్లు సంపాదించిన టాటా మోటార్స్‌ ఎస్‌యూవీ ”పంచ్‌” వాహనానికి మంచి డిమాండ్‌ వస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

వాహనానికి, వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎక్కువ భద్రత ఉంటుందన్న దానికి ఈ రేటింగ్‌ నిదర్శనం. 2021 అక్టోబర్‌లో టాటా మోటార్స్‌ ‘పంచ్‌’ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశంలో అత్యధికంగా విక్రయమవుతున్న టాప్‌-10 కార్లలో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది ఒక్క జులైలోనే 11,007 యూనిట్లు అమ్ముడుపోయాయని టాటా మోటార్స్‌ సంస్థ ప్రకటించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement