దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. భారత్ మార్కెట్లోకి బుల్లి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా పంచ్ ఈవీ కారును దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. సింగిల్ చార్జింగ్ తో 300-400 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి కారు రేంజ్ నిర్ణయిస్తారు. ఇక ఇప్పటికే బుకింగ్స్ అనుమతించింది టాటా మోటార్స్., రూ.21 వేలు తో టాటా పంచ్ ఈవీ కారు బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూ.10-13 లక్షల మధ్య పలుకుతుంది.
టాటా పంచ్ ఈవీ కారును రెండు వేరియంట్లు (స్టాండర్డ్, లాంగ్ రేంజ్)
స్టాండర్డ్ వేరియంట్ 25కిలోవాట్ల బ్యాటరీ, ప్రీమియం మోటారు లాంగ్ రేంజ్ వేరియంట్ 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తున్నాయి. స్టాండర్డ్ మోడల్ కారును 3.3 కిలోవాట్ల ఏసీ చార్జర్ కలిగి ఉంటుంది. స్టాండర్డ్ టాటా పంచ్ ఈవీ ఐదు ట్రిమ్స్ -స్మార్ట్, స్మార్ట్ +, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ +.., లాగ్ రేంజ్ టాటా పంచ్ ఈవీ మూడు ట్రిమ్స్- అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ + ట్రిమ్స్ లో లభిస్తుంది.
లాంగ్ రేంజ్ వేరియంట్ 150 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జింగ్‌తో 7.2 కిలోవాట్ల ఏసీ చార్జర్ కలిగి ఉంటుంది. లాంగ్ రేంజ్ కారు నాలుగు డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
టాటా పంచ్ ఈవీ ఫుల్ ఫీచర్స్..
టాటా పంచ్ డాష్ బోర్డ్ న్యూ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లార్జ్ టూ స్పోక్ స్టీరింగ్ వీల్ జత చేశారు. స్టాండర్డ్ వేరియంట్ 7.0-అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, లాంగ్ రేంజ్ వేరియంట్‌లో నెక్సాన్ఈవీ కారులో మాదిరిగా రోటరీ డ్రైవ్ సెలక్టర్ ఉంటది.
టాటా పంచ్ ఈవీ కారు 360-డిగ్రీ కెమెరా, లెథరట్టె సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, కనెక్టెడ్ కారు టెక్, వైర్ లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, న్యూ ఆర్కేడ్ డాట్ కాం ఈవీ యాప్, సన్ రూప్ కూడా ఆప్షన్‌గా పొందొచ్చు. సేఫ్టీ కోసం 6-ఎయిర్ బ్యాగ్స్, అన్ని వేరియంట్లలో ఏబీఎస్, ఈఎస్‌సీ, బ్లైండ్ వ్యూ మానిటర్, అన్ని సీట్లకు త్రీ పాయింట్ సీట్ బెల్టులు, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్, ఎస్వోఎస్ ఫంక్షన్ తదితర ఫీచర్లు జత కలిశాయి.
ఫుల్ విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్, ఫ్రంట్‌లో స్ప్లిట్ హెడ్ ల్యాంప్ ఉంటాయి. నెక్సాన్ ఈవీ కారులో మాదిరిగా మెయిన్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఫ్రంట్‌లో చార్జింగ్ సాకెట్, న్యూ డిజైన్డ్ బంపర్ ఉంటుంది. రేర్‌లో వై-షేఫ్డ్ బ్రేక్ లైట్ సెటప్, రూఫ్ స్పాయిలర్, డ్యుయల్ టోన్ బంపర్ డిజైన్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, నాలుగు వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. స్టోరేజీ కోసం బాయ్‌నెట్ కింద ట్రంక్ ఉంటుంది. టాటా మోటార్స్ ఈవీ నుంచి వస్తున్న నాలుగో ఆల్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ.. బుల్లి కారు కాగా, నెక్సాన్ తర్వాత వస్తున్న రెండో ఎస్‌యూవీ ఈవీ కారు. జనరేషన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్ మీద ఈ కారు డెవలప్ చేశారు.