Sunday, November 17, 2024

Tata Punch EV | సింగిల్‌ ఛార్జ్‌తో 421 కి.మీ రేంజ్‌

టాటా మోటార్స్‌కు చెందిన టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మరో కొత్త విద్యుత్‌ కారును మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. టాటా పంచ్‌ పెట్రోల్‌ వెర్షన్‌ కారు ఇప్పటికే మార్కెట్లో ఉంది. దీని విద్యుత్‌ వెర్షన్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఎలక్ట్రిక్‌ పంచ్‌ ఎక్స్‌షోరూమ్‌ ధరను 10.99 లక్షలగా నిర్ణయించింది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర 14.49 లక్షలగా ఉంటుంది. ఈ ధరలు పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. పంచ్‌ ఈవీ కారు బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇక జనవరి 22 నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. టాటా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ ప్యూర్‌ ఈవ ఆర్కిటెక్చర్‌పై పంచ్‌ విద్యుత్‌ కారును రూపొందించారు. ఈ కారు స్టాండర్ట్‌ లాంగ్‌ రేంజ్‌ వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్ట్‌ వేరియంట్‌లో 25 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 315 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. లాంగ్‌ రేంజ్‌ మోడల్‌లో 35 కిలోవాట్‌ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది.

ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మోటార్‌, బ్యాటరీ ప్యాక్‌ ఐపీ 67 రేటింగ్‌తో వస్తున్నాయి. 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీర్లు ఏది ముందైతే అది వారెంటీతో పంచ్‌ వస్తోంది. టాటా స్టాండర్ట్‌ వేరియంట్‌ 3.3 కిలోవాట్‌ హోల్‌ వాల్‌ బాక్స్‌ ఛార్జర్‌తో 9.4 గంటలు ఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. అదే 7.2కిలోవాట్‌ ఏసీ హోమ్‌ వాల్‌ బాక్స్‌ ఛార్జర్‌తో అయితే 3.6 గంటల్లో ఛార్జింగ్‌ చేసుకోవచ్చు.

- Advertisement -

50కిలోవాట్‌ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో కేవలం 56 నిముషాల్లోనే 10-80 శాతం ఛార్జ్‌ చేయవచ్చని కంపెనీ తెలిపింది. పంచ్‌ ఈవీ స్టార్ట్‌, స్మార్ట్‌ ప్లస్‌, అడ్వెంచర్‌, ఎంపవర్డ్‌, ఎంపవర్డ్‌ ప్లస్‌ పేరుతో మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్ పేరుతో మూడు డ్రైవింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. 190 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంటుంది. ఎంపవర్డ్‌ రెడ్‌, సీవీడ్‌, ఫియర్‌లెస్‌ రెడ్‌, డేటోనా గ్రే, ప్రిస్టైన్‌ వైట్‌ రంగుల్లో పంచ్‌ లభిస్తుంది. ఇందులో 16 అంగుళాల డైమండ్‌కట్‌ అల్లాయ్‌ వీల్స ఉన్నాయి.

క్యాబిన్‌ను విశాలంగా ఉండేలా తీర్చిదిద్దారు. వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, ఏక్యూఐ డిస్‌ప్లేతో కూడిన ఎయిర్‌ప్యూరిఫైయర్‌, వాయిస్‌ అసిస్టెంట్‌తో కూడిన ఎలక్ట్రిక్‌ సన్‌రూప్‌, యూఎస్‌బీ టైప్‌ సి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 10 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఇచ్చారు. ఆరు వేరువేరు భాషల్లో 200 వాయిస్‌ కమాండ్స్‌కు ఇది సపోర్టు చేస్తుంది. వైర్‌లైస్‌ స్మార్ట్‌ ఛార్జర్‌ సదుపాయం ఉంది. పంచ్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఇస్తున్నారు. 360 డిగ్రీ సరౌండ్‌ కెమెరా సిస్టమ్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement