Tuesday, November 26, 2024

రస్తోజీ గ్రూప్‌తో టాటా పవర్‌ ఒప్పందం.. ముంబైలో ఈవీ పాయింట్లు

టాటా పవర్‌ సోమవారం కీలక ప్రకటన చేసింది. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ రస్తోజీ గ్రూప్‌తో తమ కంపెనీ కీలక ఒప్పందం చేసుకుందని వివరించింది. ఈ ఒప్పందం ప్రస్తుతం.. ముంబై మెట్రోపాలిటియన్‌ రీజియన్‌లోని రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్రాజెక్టుల వరకు ఉంటుందని తెలిపింది. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ చార్జింగ్‌ సొల్యూషన్స్‌ పరంగా రస్తోజీ గ్రూప్‌తో ముందుకు వెళ్తున్నట్టు వివరించింది. టాటా పవర్‌ ఈవీ హెడ్‌ సందీప్‌ బంగియా మాట్లాడుతూ.. ఈ ఒప్పందంలో భాగంగా ముంబై ఎంఎంఆర్‌లోని నివాస ప్రాంతాల్లో.. చార్జింగ్‌ ఇన్​ఫ్రాస్ట్రక్చర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నామన్నారు. 24/7 పాటు చార్జింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మెయింటెనెన్స్‌ సపోర్టు కూడా అందించడం జరుగుతుందని వివరించారు. టాటా పవర్‌ ఈజెడ్‌ చార్జ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా అన్ని రకాల సమాచారాన్ని పొందొచ్చని తెలిపారు. కస్టమర్లకు ఈ మొబైల్‌ అప్లికేషన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. రిమోట్‌ వెహికిల్‌ చార్జింగ్‌ మానిటరింగ్‌, ఈ-పెయింట్‌ వంటి సమాచారం కూడా తెలుసుకోవచ్చని అన్నారు. రస్తోజీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రకటించారు.

ముంబైలో ఇక ఎలక్ట్రానిక్‌ వాహనాలకు ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు విషయంలో ఇబ్బందులు తీరనున్నాయని వివరించారు. ట్రాన్స్‌పొర్టేషన్‌ సెక్టార్‌ను డీ కార్బొనైజ్‌ చేయడంతో పాటు ఈవీలకు మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. టాటా పవర్‌ ఈజెడ్‌ చార్జింగ్‌.. ముంబైలో 100 ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు, దేశ వ్యాప్తంగా 1300 చార్జింగ్‌ పాయింట్లను ఆఫర్‌ చేస్తుంది. రస్తోజీ గ్రూప్‌ ఎంఈపీ కార్పొరేట్‌ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ హరూన్‌ సిద్దిఖీ మాట్లాడుతూ.. కార్బన్‌ రహిత సమాజం నిర్మించేందుకు ఈ చిన్న అడుగు.. భారీ లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పాటును అందిస్తుందన్నారు. టాటాపర్‌ ఈవీ చార్జింగ్‌ ఇన్​ఫ్రాస్ట్రక్చర్‌ను సెటప్‌ చేయడానికి టాటా పవర్‌ అపోలో టైర్స్‌, హెచ్‌పీసీఎల్‌, టీవీఎస్‌ మోటార్స్‌, అమాస్టేస్‌ అండ్‌ ట్రైల్స్‌తో పాటు పలువురితో భాగస్వామ్యం కలిగి ఉంది. రస్తోజీ గ్రూప్‌.. 20 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం, 280కు పైగా భవనాలు, 14000 పైగా ఇళ్లను అందజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో ఈవీ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సైతం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement