Friday, November 22, 2024

సెప్టెంబర్ లో టాటా నెక్సాన్ రికార్డు సేల్స్.. అత్యధికంగా అమ్ముడైన టాప్ SUV కార్లు ఇవే !

భారత మార్కెట్లో గ‌త నెల (సెప్టెంబరు)లో కార్ల విక్రయాలు జోరుగా సాగాయి. దేశీయ హోల్‌సేల్ పరంగా సెప్టెంబర్‌లో రికార్డు సేల్స్ జరిగాయి. ఆటో పరిశ్రమలో అత్యధిక నెలవారీ వాల్యూమ్‌ను 360,897 యూనిట్లుగా నమోదు చేసింది. ఏకంగా SUV విభాగంలో 52శాతం ఎక్కువగా నమోదైంది.

కాగా, అత్యధికంగా అమ్ముడైన SUV పాపులర్ మోడల్ కార్లలో టాటా నెక్సాన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా ఉన్నాయి. అయితే, సెప్టెంబర్‌లో SUV సెగ్మెంట్ అద్భుతంగా కొనసాగడంతో ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 SUV కార్ల మోడల్స్ ఏంటో ఓసారి చూద్దాం..

టాప్ 3లో నెక్సన్, బ్రెజ్జా, పంచ్..

టాటా నెక్సాన్ SUV సెగ్మెంట్ 15,325 యూనిట్ల వద్ద టాపర్‌గా నిలిచింది. 15,001 యూనిట్ల వద్ద మారుతి సుజుకి బ్రెజ్జా తర్వాతి స్థానంలో ఉంది. టాటా పంచ్ 13,045 యూనిట్ల వద్ద కొనసాగించింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్ క్రెటా 12,717 యూనిట్లు, హ్యుందాయ్ వెన్యూ 12,204 యూనిట్లు, మహీంద్రా స్కార్పియో (N, క్లాసిక్) 11,846 యూనిట్ల విక్రయాలతో నిలిచాయి.

- Advertisement -

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన 10 SUV కార్లు..

టాటా నెక్సాన్ – 15,325 యూనిట్లు
మారుతి సుజుకి బ్రెజ్జా – 15,001 యూనిట్లు
టాటా పంచ్ – 13,045 యూనిట్లు
హ్యుందాయ్ క్రెటా – 12,717 యూనిట్లు
హ్యుందాయ్ వెన్యూ – 12,204 యూనిట్లు
మహీంద్రా స్కార్పియో – 11,846 యూనిట్లు
మారుతి సుజుకి గ్రాండ్ విటారా – 11,736 యూనిట్లు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ – 11,455 యూనిట్లు
కియా సెల్టోస్ – 10,558 యూనిట్లు
మహీంద్రా బొలెరో – 9,519 యూనిట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement