Saturday, November 23, 2024

టాటా మోటార్స్‌ నికర లాభం 3,783 కోట్లు..

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ సెప్టెంబర్‌తో ముగిసిన 2వ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు వెల్లడించింది. ఈ త్రైమాసికంలోకంపెనీ 3,783 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 1,004 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో 79,611 కోట్ల నుంచి 1,05,128 కోట్లకు పెరిగింది.

టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన అమ్మకాలు సెప్టెబర్‌తో ముగిసిన మూడు నెలల వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన 2.4 శాతం తగ్గి 1.39 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన అమ్మకాలు 3.5 శాతం పెరిగి 1.04 లక్షల యూనిట్లకు చేరాయి. కంపెనీ అనుబంధ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ విక్రయాలు 29 శాతం పెరిగి 96,817 యూనిట్లకు చేరాయి.

- Advertisement -

సెమీకండక్టర్ల సరఫరా పెరగడంతో కంపెనీ తయారీ, విక్రయాలు పుంజుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరం ద్వీతీయార్ధంలోనూ కంపెనీ బలమైన ఫలితాలను నమోదు చేస్తుందని తెలిపింది. జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ వద్ద బలమైన ఆర్డర్‌ బుక్‌ ఉందని, హెవీ ట్రక్కులకు డిమాండ్‌ పెరుగుతుందని తెలిపింది. ప్రయాణికుల వాహన విభాగంలో కొత్త కార్లకు ఆదరణ పెరుగుతుందని టాటా మోటార్స్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement