Saturday, November 23, 2024

TATA | వాణిజ్య వాహన ధరలు పెంచిన టాటా మోటార్స్‌

టాటా మోటార్స్‌ తన వాణిజ్య వాహనాల ధరలను ఏప్రిల్‌ 1 నుంచి 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్‌ఫుట్‌ వ్యయాలు పెరిగినందున వీటి ధరలు పెంచాల్సి వచ్చిందని టాటా మోటార్స్‌ తెలిపింది. ఇటీవలే టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్‌ వాహనల విభాగాలను స్వతంత్ర సంస్థలుగా విభజించింది. 2023 జనవరిలో టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరలను 3 శాతం పెంచింది. వాహనల ధరలు పెంచడం ద్వారా టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల విభాగం తన రుణాలు తీర్చుకునేందుకు, నగదు లభ్యత పెంచుకునేందుకు దోహద పడుతుందని రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement