టాటా గ్రూప్, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ సంయుక్తంగా సివిలియన్ హెలికాప్ట ర్ల తయారీకి ఒప్పందంపై సంతకం చేశాయని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా శుక్రవారం నాడు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూవెల్ మైక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదరినట్లు ఆయన తెలిపారు. టాటా గ్రూప్, ఎయిర్ బస్సు సంయుక్తంగా ఇప్పటికే సీ- 295 ట్రాన్స్‌పోర్టు హెలికాప్ట ర్లను గుజరాత్‌లోని ప్లాంట్‌లో తయారు చేస్తున్నాయి.
ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందంతో హెచ్125 హెలికాప్ట ర్లను తయారు చేస్తాయని, వీటిలో ఎక్కువగా స్థానిక కంపోనెంట్స్‌ను వినియోగించనున్నారని ఆయన తెలిపారు. ఇక్కడ తయారు చేసే హెలికాప్ట ర్లను భారత్ పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ఎయిర్‌బస్ తెలిపింది. 2026 నాటికి వీటి ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా రక్షణ రంగంలోనూ సహకారం గురించి చర్చించినట్లు తెలిపారు.
ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ ఇండియాలో చేసే విషయంపై చర్చించినట్లు తెలిపారు. విమాన ఇంజిన్ల తయారీకి సంబంధించిన భారత్‌కు వంద శాతం సహాయ సహకారాలు అందించేందుకు శాఫ్రాన్ సంస్థ సంసిద్ధత తెలిపింది. రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీతో పాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం, అంతరిక్ష, సైబర్ స్పేస్, కృత్రిమ మేథ, రోబోటిక్స్, స్వయం చోదిత వాహనాల వంటి రంగాల్లో సహాయసహకారాలు అందజేసుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు.