Monday, November 18, 2024

Tata EV | ప్రీమియం ఎలక్ట్రిక్‌ కార్లపై టాటా ఫోకస్‌

టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రికల్‌ మొబిలిటీ లిమిటెడ్‌ (టీపీఈఎం), టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థగా ఉన్న జగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) సంయుక్తంగా ప్రీమియం ఎలక్ట్రిక్‌ కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. టీపీఈఎం డెవలప్‌ చేస్తున్న అవిన్యా ప్రీమియం విద్యుత్‌ కార్ల సీరిస్‌ను తీసుకురావాలని ఒప్పందం చేసుకున్నాయి. జేఎల్‌ఆర్‌కు చెందిన ఎలక్ట్రిఫైయిడ్‌ మాడ్యూలర్‌ ఆర్కిస్ట్రక్చర్‌ (ఈఎంఏ) ప్లాట్‌ఫామ్‌పై అవిన్యా సీరిస్‌లో ప్రీమియం కార్లను తీసుకు రానున్నాయి.

ఈ ఒప్పందంతో త్వరలోనే ఈ సీరిస్‌లో మొదటి కారును మార్కెట్లోకి తీసుకు రానున్నారు. జేఎల్‌ఆర్‌ ఈఎంఏ ప్లాట్‌ఫామ్‌ నుంచి 2025లో మిడ్‌ సైజ్‌ విద్యుత్‌ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ఈ కారులో అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నాయి. సాఫ్ట్‌వేర్‌, బ్యాటరీ ప్యాక్‌, ఇతర అన్ని ఆధునిక సదుపాయాలు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీతో భాగస్వామ్యంలో తీసుకురానున్న కార్లలోనూ ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement